HomecinemaBala Krishna: బాల‌య్య‌తో స్టెప్పులేసేందుకు సిద్ధ‌మైన అందాల యాంక‌రమ్మ‌..ఇక దబిడి దిబిడే..!

Bala Krishna: బాల‌య్య‌తో స్టెప్పులేసేందుకు సిద్ధ‌మైన అందాల యాంక‌రమ్మ‌..ఇక దబిడి దిబిడే..!

Telugu Flash News

Bala Krishna: నంద‌మూరి బాల‌కృష్ణ స్పీడ్‌కి బ్రేకుల్లేవు. ఒకవైపు సినిమాలు, మ‌రోవైపు షోస్‌తో ర‌చ్చ రచ్చ చేస్తున్నాడు. 60 ప్లస్‌లోనూ ఫుల్ జోష్‌తో సినిమాలు చేస్తూ కుర్ర‌హీరోల‌కు పోటీ ఇస్తున్నాడు.

చివ‌రిగా ‘అఖండ’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన బాల‌య్య‌.. పాండమిక్ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపుని, ఉత్సాహాన్ని ఇచ్చి అంద‌రిచే ప్ర‌శంస‌లు అందుకున్నాడు.

ఇక అదే ఊపుతో ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరెక్షన్లో NBK 107 (వర్కింగ్ టైటిల్) మూవీ చేస్తుండ‌గా, ఈ చిత్రం పూర్తైన త‌ర్వాత తన 108వ సినిమాని అనిల్ రావిపూడితో ఫిక్స్ చేశాడు.ఈ రెండు సినిమాల‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

జోరు పెంచేందుకు..

బాల‌య్య‌- అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొంద‌నున్న సినిమాపై రోజురోజుకి కొత్త వార్త‌లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్న అనిల్ త‌న తాజా చిత్రంలో బాల‌య్య‌ని వ‌యసుమల్లిన పాత్రలో అలాగే యువకుడి పాత్రలో చూపించ‌చనున్నారట.

ఇందులో యాక్షన్ తోపాటు అనిల్ స్టైల్ కామెడీ కూడా ఉండనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం అందాల భామ అనసూయను తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. ఈ యాంక‌రమ్మ బాల‌య్య‌తో క‌లిసి ఓరేంజ్‌లో స్టెప్పులు వేయ‌నుంద‌ని వినికిడి. ఇదే జ‌రిగితే ఇక ద‌బిడి దిబిడే అంటున్నారు.

ఇక బాల‌కృష్ణ ప్ర‌స్తుతం అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 షో కోసం రెడీ అవుతున్నారు.తొలి సీజ‌న్లో అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ, రానా, నాని, విజయ్ దేవరకొండ, రాజమౌళి, సుకుమార్, పూరి, ఛార్మి, రష్మిక మందన్న లాంటి సెలబ్రిటీస్ తో తెగ సంద‌డి చేశాడు.

-Advertisement-

ఇక రెండో సీజ‌న్ అక్టోబ‌ర్ లో మొద‌లు కానుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ సీజన్‌లో చిరు, రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి సెల‌బ్స్ కూడా వ‌స్తార‌ని టాక్. చిరు , బాల‌య్య చాలా రోజుల త‌ర్వాత ఒకే ఫ్రేములో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తుండ‌డంతో ఫ్యాన్స్ తెగ జోష్‌లో ఉన్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News