రాజకీయ నాయకులు, ప్రభుత్వ ప్రతినిధుల మీటింగ్స్, రోడ్ షోలు, కాన్వాయ్స్ వలన ప్రజలు ఎన్ని ఇబ్బందులకి గురవుతూ ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సామాన్యులు వీటిపై ఎన్ని సార్లు నోరు విప్పిన ఎవరు పెద్దగా పట్టించుకోరు. అదే ఒక సెలబ్రిటీ మాట్లాడితే హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ఓ సంఘటన సింగర్ శ్రీరామచంద్ర అసహనానికి కారణమైంది. ఓ పొలిటీషియన్ కోసం ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారట. దాంతో ఆయన ఎక్కాల్సిన గోవా ఫ్లైట్ మిస్ కావడంతో తన అసహనం, పబ్లిక్ ఇబ్బందులు తెలియజేస్తూ వీడియో పోస్ట్ చేశారు.
ఓ పొలిటీషియన్ కోసం పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ బ్లాక్ చేయడంతో పబ్లిక్ క్రింది నుండి పోవాల్సి వచ్చింది. హెవీ ట్రాఫిక్ ఏర్పడటంతో అరగంట ఆలస్యమైంది. నేను గోవా వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యింది. గోవాలో ఒక ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంది. వేరే ఫ్లైట్ పట్టుకోవడం గోవా చేరుకోవడం కష్టమైన పని. నాతో పాటు మరికొందరు ఇదే రీజన్ తో ఫ్లైట్ మిస్ అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గార్లకు నా విన్నపం ఏమిటంటే… పొలిటికల్ లీడర్స్ కోసం సామాన్య జనాలను ఇబ్బంది పెట్టకండి… అంటూ తన వీడియోలో చెప్పుకొచ్చారు. కాగా బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని మరింత పాపులారిటీ రాబట్టాడు శ్రీరామచంద్ర.
also read:
ఉక్రెయిన్ కు యుద్ధ విమానాలు సరఫరా నిలిపివేస్తున్నట్లు జో బైడెన్ సంచలన ప్రకటన
Varla Ramaiah : ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు.. ఏపీ సర్కార్‌పై టీడీపీ ఆరోపణలు