HomecinemaSremukhi: శ్రీముఖికి ఎంత ధైర్యం.. పెద్ద‌పులితో ఆ ఆట‌లేంద‌మ్మ‌డు..!

Sremukhi: శ్రీముఖికి ఎంత ధైర్యం.. పెద్ద‌పులితో ఆ ఆట‌లేంద‌మ్మ‌డు..!

Telugu Flash News

Sremukhi: బుల్లితెర‌పై త‌న క్యూట్ మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం ప‌లు షోలతో బిజీగా ఉంది. ఇక ఖాళీ స‌మ‌యం దొరికితే చాలు విహారయాత్ర‌ల‌కి వెళుతూ ఉంటుంది. తాజ‌గా త‌న బర్త్ డే వేడుకల కోసం థాయిలాండ్ వెళ్లిన శ్రీముఖి ఫుకెట్ నగరంలో ఉన్న జూకి వెళ్లింది. అక్క‌డ పెద్ద పులి ప‌డుకొని ఉండ‌గా, దానితో స‌ర‌దాగా ఆట‌లాడుతూ క‌నిపించింది. ఇది చూసిన జ‌నాలు వామ్మో ఏంటా ధైర్యం.. నువ్వు అనుకుంటే ఏదైన లొంగిపోతుందిలే అని కామెంట్స్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం సినిమాలు, టీవీ షోస్ చేస్తున్న శ్రీముఖి హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేర్చుకుంది. ల‌గ్జ‌రీ హౌజ్ క‌ట్టుకుంది. .. పటాస్ షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన కూడా ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది. ఈ అమ్మ‌డు బిగ్ బాస్ నుండి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. చివ‌రిగా క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. ప్ర‌స్తుతం చిరంజీవి భోళా శంకర్, బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రాల్లో న‌టిస్తుంది ఈ అమ్మ‌డు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News