Special Stories : చికాగోలో జరిగిన ఒక హత్య కేసును పోలీసులు చేదించిన విధానం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అసలా రహస్యం ఏంటి? అసలేం జరిగింది? తెలియాలంటే ఈ రోజు ఈ కథ తెలుసుకో వాల్సిందే.
1929లో పిలిపియన్స్ లో జన్మించింది తెరేసిత బస. చిన్నప్పట్నుంచీ సంగీతంపై ప్రేమ పెంచుకున్న తెరేసిత 1960లో సంగీతం నేర్చుకోవడానికి అమెరికాకు వెళ్లిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత శ్వాసకోశ థెరపిస్ట్ గా చికాగోలోని ఒక హాస్పిటల్లో పని చేయడం ప్రారంభించింది.
తేరేసిత తన స్నేహితులతో,బంధువులతో ఎంతో సరదాగా కలిసి మెలిసి ఉండేదట. ఎప్పుడూ ఎవరితో అనవసరంగా గొడవలకు దిగేది కాదట. అటువంటి తెరేసిత ఒకరి చేతిలో హత్యకు గురై చనిపోతుందని ఎవరూ ఊహించలేదు.
1977, ఫిబ్రవరి 21న తెరేసిత తన ఇంట్లోనే తనను ఎవరో హత్య చేసి చంపినట్టుగా వంటిపై బట్టలు లేకుండా ఛాతీలో కత్తితో కాలుతున్న పరుపుకింద చనిపోయి కనిపించింది.
ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ అసలు గొడవలకు వెళ్ళని తెరేసితను ఎవరూ చంపుటారా అని ఆశ్చర్యపోయారు.ఆమె హంతకుడిని కనిపెట్టాలని పోలీసులు ఎంత ప్రయత్నించినా హత్యను సాల్వ్ చేసే ఆధారాలేవి దొరకలేదు.
కానీ తెరేసిత ఇంట్లో ఉండాల్సిన తన బంగారం కొంత కనిపించకుండా పోయి అది దొంగ తనం అయ్యుంటుందని పోలీసులలో అనుమానాలను రేకెత్తించింది. దీంతో పోలీసులు దొంగతనం వైపుగా ఆలోచించి ఇన్వెస్టిగేషన్ని ప్రారంబించారు.
కానీ అది కూడా పలితం లేకుండా మధ్యలోనే ఆగిపోయింది.ఇక సరైన ఆధారాలు దొరకపోవడంతో తెరేసిత హత్య కేసు కొన్ని నెలల పాటు ఎటువంటి పురోగతి లేకుండా అలా సాగుతూ ఉండిపోయింది.
కథలో మలుపు
తెరేసిత చనిపోయిన 5 నెలల తరువాత ఫిలిపియన్ కు చెందిన మరో అమ్మాయి తెరేసిత సహ ఉద్యోగిని రెమి తన భర్త జో తో కలిసి పోలీసుల దగ్గరకు వెళ్లి తెరేసితను ఎవరు హత్య చేశారో తనకు తెలుసని చెప్పుకొచ్చింది.
రెమి భర్త జో పోలీసులతో మాట్లాడుతూ ఒక రోజు రాత్రి రెమి పడుకున్న తరువాత హఠాత్తుగా లేచి ఒక విచిత్రమైన గొంతుతో మాట్లాడుతూ తాను తెరేసితన ని తనను చంపింది అల్లన్ షవరీ అనే ఒక టీవీ మెకానిక్ అని చెప్పిందని చెప్పుకొచ్చాడు.
పోలీసులు మొదట్లో ఎటువంటి ఆధారాలు లేని ఈ మాటలు నమ్మలేకపోయినప్పటికీ తరువాత వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో అల్లన్ షవరీనే ఈ హత్య చేశాడనటానికి రుజువుగా కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
తెరేసిత హత్యకు గురైన రోజు షవరీ ఆమె ఇంట్లో టీవి బాగుచేయడానికి వెళ్ళాడని, ఆ రాత్రే ప్లాన్ చేసి మళ్ళీ తెరేసిత ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి చంపాడని పోలీసులు తెలుసుకున్నారు. అక్కడితో ఆగకుండా ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి అల్లన్ షవరీ భార్యకు కూడా ఫోన్ చేశారు పోలీసులు.
షవరీ భార్యతో పోలీసులు మాట్లాడుతూ తనకు ఈ మధ్య కాలంలో షవరీ ఏమైనా బంగారం ఇచ్చాడా అని ప్రశ్నించగా ఆమె ఇచ్చాడని చెప్పింది. తెరేసిత తల్లిదండ్రులతో ఆ బంగారాన్ని చూసి అమేవో కావో చెప్పమని అడగగా వాళ్ళు అవి తెరేసితావేనని స్పష్టం చేశారు. దీంతో తెరేసిత బస ను చంపింది అల్లన్ షవరీనే అని పోలీసులు ఒక నిర్ధారణకి వచ్చారు.
కానీ రెమి మరియు తన భర్త చెప్పినట్టు నిజంగానే రెమి శరీరంలోకి తెరేసిత ఆత్మ వచ్చిందా? లేక వాళ్లకు తెరేసిత హత్య కేసు గురించి ఇంకేమైనా తెలుసా? తెరేసిత హత్య కేసు సాల్వ్ అయ్యినప్పటికీ ఇంకా సమాధానాలు లేని ఎన్నో ప్రశ్నలు రహస్యాలుగానే మిగిలిపోయాయి.
also read news:
moral stories in telugu : దేవుడి జవాబులు
Jagan vs Pawan Kalyan : ఏపీలో జగన్ వర్సెస్ పవన్.. ఆర్మీ రంగుపై మళ్లీ రాజకీయ వేడి!