టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఓడిన న్యూజిల్యాండ్, టీమిండియా రెండు జట్లు వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌పై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే టీ 20 సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ వన్డే సిరీస్ గెలవాలని తహతహలాడుతుంది. మెడికల్ అప్పాయింట్‌మెంట్ వల్ల మూడో టీ20కి దూరమైన కివీ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఈ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. వెటరన్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గైర్హాజరీలో యువ భారత జట్టును శిఖర్ ధవన్ ముందుండి నడపించబోతున్నడు. ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఐష్ సోధికి జట్టులో చోటు దక్కలేదు.
ఇక ఇండియా విషయానికి వస్తే సూర్య కుమార్ యాదవ్, సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో ఆడుతున్నారు. ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ ఇద్దరూ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే బంగ్లాదేశ్‌లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ల కోసం వరల్డ్ కప్ సమయంలోనే జట్లను ప్రకటించిన సెలెక్టర్లు.. తాజాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ జట్టులో రెండు మార్పులు చేశారు. రవీంద్ర జడేజా, దయాల్ స్థానంలో కుల్దీప్ సేన్, షాబాజ్‌లను జట్టులోకి తీసుకోగా, టీ20ల్లో అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు, అవకాశాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంజు శాంసన్‌కు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు.
ఈ విషయంపైనే క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బీసీసీఐలో కులతత్వం రాజ్యమేలుతుందని.. అందుకే సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్‌లకు అన్యాయం చేస్తున్నారంటూ కొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం న్యూజిల్యాండ్ తో మూడు వన్డేలు ఆడనున్న సూర్య కుమార్ యాదవ్ ఇందులోను రాణిస్తే మాత్రం ఆయనకు రానున్న రోజులలో వన్డేలకు ఛాన్స్ రానున్నట్టు తెలుస్తుంది.
also read news:
Rashmika: రష్మికపై బ్యాన్ విధించారా.. అంత తప్పు ఏం చేసింది…!
రాజస్థాన్ ఖీమా బిర్యానీ తయారు చేయండిలా