HomecinemaSita Ramam : సీతారామం సినిమా ఖాతాలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌.. ఏ కేటగిరిలో అంటే..!

Sita Ramam : సీతారామం సినిమా ఖాతాలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌.. ఏ కేటగిరిలో అంటే..!

Telugu Flash News

Sita Ramam:  సైలెంట్ గా వచ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రాల‌లో సీతారామం ఒక‌టి. ఎలాంటి అంచనాల్లేకుండా విడుద‌లై బాక్సాఫీస్‌ దగ్గర బ్లాస్టింగ్ ఫీట్లు చేసిందీ ఈ చిత్రం. దుల్కర్ సల్మాన్ హీరోగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హనురాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమాతో దుల్కర్ టాలీవుడ్ లో సెట్ అయిపోయాడు.

వ‌రుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్న హనురాఘవపూడికి ఈ సినిమా కొంత ఉప‌శ‌మ‌నం ఇచ్చింద‌నే చెప్పాలి. అయితే తాజాగా సీతారామం అరుదైన ఘనత కూడా సాధించింది. ఇండియన్ యాక్టర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును ఈ మూవీ గెలుచుకోవ‌డం విశేషం.

పదమూడవ దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో స్పెషల్ జ్యూరి కేటగిరీలో సీతారామం ఉత్తమ సినిమా అవార్డు ద‌క్కించుకుంది. క్లాసిక్ లవ్‌స్టోరీగా వచ్చిన సీతారామం ఇంత గొప్ప అవార్డు ద‌క్కించుకోవ‌డంతో చిత్ర బృందం ఫుల్ ఖుష్ అవుతుంది. టీమ్ అంతా సంబ‌రాలు చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News