వరల్డ్ కప్‌లో ఆడిన భారత జట్టుని సెలక్ట్ చేసిన సెలక్షన్ కమిటీపై ఇప్పటికీ విమర్శలు కురుస్తూనే ఉన్నాయి. మంచి ప్లేయర్స్‌ని పక్కనబెట్టి చెత్త ప్లేయర్స్‌ని ఎంపిక చేశారనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. మొన్నా మధ్య దీపక్ హుడా అద్భుతమైన బౌలింగ్ వేసి ప్రశంసలు దక్కించుకోవడంతో అతడిని అసలు ఎందుకు ఆడించలేదు, ఆడించిన కూడా బౌలింగ్ చేయించలేదనే విమర్శలు కురిపించారు.
ఇక తాజా మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ సిరాజ్ అద్భుతంగా ఆడి నాలుగు వికెట్స్ తీసాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఈ హైదరాబాద్ స్టార్ కనబర్చిన అద్భుత ప్రదర్శన తర్వాత అందరూ సిరాజ్‌ను టీమిండియా తక్కువ అంచనా వేసిందా? టీ20 ప్రపంచకప్ ఆడించకుండా ఘోర తప్పిదం చేసిందా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు.
స్వింగ్ బౌలర్ అయిన సిరాజ్.. కివీస్ కండిషన్స్‌ను అద్భుతంగా ఉపయోగించుకొని మూడో టీ20లో నాలుగు వికెట్లు పడగొట్టిన సిరాజ్(4/17) టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసుకున్నాడు. ఫస్ట్ ఓవర్‌లోనే మార్క్‌చాప్‌మన్(12)ను ఔట్ చేసిన సిరాజ్.. తన మూడో ఓవర్‌లో డేంజరస్ గ్లేన్ ఫిలిప్స్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54)ను పెవిలియన్ బాట పట్టించాడు.
ఇక తన చివరి ఓవర్‌లో జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్‌లను పెవిలియన్ కి పంపాడు.. 130/2 స్కోర్‌తో పటిష్టంగా కనిపించిన కివీస్ ఓ దశలో 190+ పరుగులు చేస్తుందేమో అనిపించగా, సిరాజ్ సూపర్ బౌలింగ్‌తో 160 పరుగులకే కట్టడి చేశాడు.
మంచి ఫామ్‌లో ఉన్న డాట్ బాల్స్‌తో ఫిలిప్స్‌ను ఒత్తిడికి గురి చేసి ఫిలిప్స్‌ను ఔట్ చేఏశాడు. ఈ వికెట్‌తో మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన కివీస్ బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. రెండు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసిన ఈ హైదరాబాద్ స్టార్ 6.83 యావరేజ్.. 5.12 ఎకానమీతో అద్భుత బౌలింగ్ చేశాడు.
అతని బౌలింగ్ స్ట్రైక్ రైట్ 8గా ఉండటం విశేషం. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా.. బెస్ట్ యావరేజ్, ఎకానమీ, స్ట్రైక్‌రైట్ కలిగిన బౌలర్‌గా నిలవడంతో సిరాజ్‌ని వరల్డ్ కప్‌లో తీసుకొని ఉంటే బాగుండేది అని కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
also read news:
డొనాల్డ్ ట్రంప్ , అతడి ముగ్గురు పిల్లలపై పన్ను ఎగవేత కేసు.. ఎందుకు.. ఏమిటి?
2022లో సెలబ్రిటీల వెకేషన్ కు వేదికలైన ఈ 5 ప్రదేశాలు !!