HomecinemaIleana : ఇలియానా సినిమాల‌లో క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదా?

Ileana : ఇలియానా సినిమాల‌లో క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదా?

Telugu Flash News

Ileana : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇలియానా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నేండ్ల పాటు తెలుగుతోపాటు సౌత్ సినిమాల్లో దుమ్ములేపిన ఈ భామ స్టార్ హీరోల సరసన నటించి గుర్తుండిపోయే సినిమాలు చేసింది. మరోవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా గట్టిగానే సంపాదించుకున్నారు.

2018 లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తర్వాత సౌత్ లో ఒక్కసినిమా కూడా చేయలేదు. అంతకముందు ఆరేండ్ల పాటు సౌత్ సినిమాలకు దూరంగానే ఉన్నారు. అసలు దక్షిణాది సినిమాలకు ఎందుకు దూరమవ్వాల్సి వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు.

ఇక రీసెంట్ గా ఈవిషయంపై ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. తమిళంలో ఓ సినిమాకు సైన్ చేసిన ఇలియానా రూ.40 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నారంట. అయితే కొన్ని కారణాలతో సినిమా ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ను పే బ్యాక్ చేయాలని ఇలియానను కోర‌గా, దీంతో గోవా బ్యూటీ నిరాకరించినట్టు ప్రచారం.

అయితే కౌన్సిల్ కూడా తిరిగివ్వాలని చెప్పిన కూడా ఇలియానా స్పందించకపోవడంతో.. సమస్య పరిష్కారమయ్యే వరకు సౌత్ సినిమాలకు ఆమెను తీసుకోకూడదని నిర్ణయించారంట. అందుకే ఇలియానా ఇన్నాళ్లు తెలుగు, తమిళ సినిమాలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

also read :

Viral Video: పెళ్లిలో పన్నీర్‌ కోసం లొల్లి.. బుర్రలు పగిలేలా కొట్టుకున్నారు!

-Advertisement-

Viral video : అక్కడ డ్యాన్స్‌ చేసినందుకు పదేళ్ల జైలు శిక్ష.. ఇరాన్‌లో యువ జంటకు షాక్‌!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News