HomecinemaSamantha : స‌మంతని పెళ్లి కుమార్తెగా చూసే స‌రికి నాకు ఏడుపాగలేదు: శోభిత ధూళిపాళ్ల‌

Samantha : స‌మంతని పెళ్లి కుమార్తెగా చూసే స‌రికి నాకు ఏడుపాగలేదు: శోభిత ధూళిపాళ్ల‌

Telugu Flash News

Samantha : ఇటీవ‌లి కాలంలో శోభిత దూళిపాళ్ల పేరు ఎక్కువ‌గా వినిపిస్తుంది.సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌ల‌తో బిజీగా ఉంది. గత కొంతకాలంగా ఈ బ్యూటీ నాగ చైత‌న్య‌తో డేటింగ్‌ వార్తలతో హల్చల్‌ చేస్తోంది. ఇటీవ‌ల ఈ ఇద్ద‌రు లండన్‌లో డేట్‌కు వెళ్లిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా శోభిత త‌న ఇన్‌స్టాలో సమంతను పెళ్లి కుమార్తెగా చూసి కన్నీళ్లు ఆగలేదు అంటూ చేసిన కామెంట్స్ నెట్టింట అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.

రీసెంట్‌గా శోభిత.. ఓ పెళ్లికి హాజరయ్యింది. వాటిని షేర్ చేస్తూ.. ‘‘మెహందీ ఫంక్షన్ లో.. ఎన్నో కొత్త ముఖాలు. ఎంతో ఆశ్చర్యంగా మరింత ఆనందంగా క‌నిపించాయి. నా ప్రాణ స్నేహితురాలు కూడా ఏ మాత్రం రెడీ అవ్వకుండ నాకు తోడుగానే ఉంది. నేను తారా ఖన్నా లా మారిపోయి.. ఏర్పాట్లన్ని దగ్గరుండి మ‌రీ చూసుకున్నాను. అందుకే నేను రెడీ అవ్వడానికి ఏ మాత్రం టైం దొరకలేదు. కానీ పెళ్లి మండపంలో మొదటిసారి సమంతను పెళ్లి కుమార్తెగా చూడగానే.. ఎందుకో నాకు ఏడుపాగలేదు అని పేర్కొంది. ఇంత‌కు ఆ స‌మంత ఎవ‌రనుకుంటున్నారు కదూ.. శోబితా చెల్లి పేరు కూడా సమంత నే..

also read :

Marlene Schiappa : వివాదాల్లో ఫ్రాన్స్‌ మహిళా మంత్రి.. ప్లేబాయ్‌ పత్రికపై పోజులు

-Advertisement-

Kerala train fire: కేరళలో దారుణం.. రైలులో ప్రయాణికుల మధ్య గొడవ.. తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News