Shiva Jyothi: సెలబ్రిటీల పేరుతో సైబర్ నేరగాళ్లు ఎన్ని మోసాలకు పాల్పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం.కొంత అజాగ్రత్తగా ఉంటే చాలు వెంటనే వారి జేబు ఖాళీ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్, యాంకర్ శివజ్యోతి పేరుతో భారీ మోసం బయటపడింది.
హుస్సేన్ అనే యువకుడు యాంకర్ శివ జ్యోతికి పెద్ద ఫ్యాన్ కావడంతో దానిని గుర్తించి అతనికి పదివేలు టోకరా వేసారు. అతనికి యూట్యూబ్ ఛానల్ ద్వారా రివార్డ్స్ పాయింట్స్ వచ్చాయి అని టెలిగ్రామ్ ద్వారా ఓ లింక్ రాగా, ఈ రివార్డ్స్ అందుకోవాలి అంటే 1000 రూపాయలు కట్టాలని సైబర్ నేరగాళ్లు అతనికి చెప్పారు.
రివార్డ్ పాయింట్స్ వస్తాయి అన్న ఆనందంలో వారు అడిగినంత మనీ ఇచ్చేశాడు. హుసేన్ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. మరోసారి 3వేలు, వెంటనే మరో 6 వేలు కడితే రివార్డ్ పాయింట్స్ వస్తాయని అని చెప్పడంతో, పాయింట్స్ వస్తాయి కదా అన్న ఆనందంలో మొత్తం 10వేలు కట్టాడు.
అయితే అతనికి రివార్డ్ పాయింట్స్ రాకపోవడంతో.. మోసపోయాను అని అప్పుడు గుర్తించిన హుస్సేన్ శివజ్యోతికి సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలియజేశాడు హుస్సేన్. అయితే దీనిపై స్పందించిన శివజ్యోతి ..తన పేరుతో ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వడంలేదని .. దయచేసి ప్యాన్స్ గుర్తించాలి అని చెప్పుకొచ్చింది.
also read :
Horoscope (02-03-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
Viral Video : వధూవరులను వీడియో తీస్తూ డ్రెయినేజీలో పడిపోయిన మహిళ!