బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (shah rukh khan) కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించారు. తాజాగా మరో కొత్త రికార్డ్ షారూఖ్ ఖాతాలో వచ్చి చేరింది. ఇండియన్ సినిమాలో.. స్టార్లుగా ఓ వెలుగు వెలుగుతున్న టాప్ స్టార్స్ ను పక్కకు నెట్టి.. హైరెమ్యూనరేషన్ ను తన ఖాతాలో వేసుకొని అందరు నోరెళ్లపెట్టేలా చేశారు షారూఖ్.
పఠాన్ సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టించిన షారుఖ్..ఈ చిత్రంతో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా రికార్డ్ సాధించారు. పఠాన్ చిత్రం సాలిడ్ హిట్ కొట్టగా, ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమా కోసం షారుఖ్‌ఖాన్ తొలుత ఎలాంటి పారితోషికాన్ని తీసుకోలేదు. రిలీజ్ తరువాత లాభాల్లో కొంత వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడట షారుఖ్.
ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అగ్రిమెంట్ ప్రకారం షారుఖ్‌ఖాన్ దాదాపు 200కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను అందుకున్నారని బాలీవుడ్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తుంది.. గతంలో చూస్తే… ప్రభాస్, అక్షయ్ కుమార్, రజనీ కాంత్ లాంటి కొంత మంది స్టార్స్ మాత్రమే 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నారు.
also read :
Anasuya: 15 ఏళ్ల తర్వాత ఆ చీరలో మెరిసిన అనసూయ.. ఆ చీర స్పెషాలిటీ ఏంటంటే..!