HomecinemaShakuntalam: శాకుంత‌లం సినిమా కోసం వాడిన బంగారం, వ‌జ్రాల ధ‌ర ఎంత తెలిస్తే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..!

Shakuntalam: శాకుంత‌లం సినిమా కోసం వాడిన బంగారం, వ‌జ్రాల ధ‌ర ఎంత తెలిస్తే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..!

Telugu Flash News

Shakuntalam: సమంత నటించిన `శాకుంతలం` సినిమా త్వరలో రాబోతుండ‌గా, ఈ సినిమాని మైథలాజికల్‌ నేపథ్యంలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ప్రధానంగా గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో ఆభరణాల పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. దుష్యంతుడి రాజమహల్‌లో దేవతలు, రాజుల పాత్రలకు భారీగా నగలు వాడాల్సి ఉండ‌గా, ఇందులో కేజీలకు కేజీల బంగారు అభరణాలు వాడినట్టు తాజాగా గుణ‌శేఖ‌ర్ తెలిపారు. వాటి విలువల సుమారు రూ.14 కోట్లు ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు.

వసుంధర జ్యూవెల్లరీ వారితో మాట్లాడి శాకుంత‌లం సినిమా కోసం జ్యువెల‌రీని త‌యారు చేయించుకున్నారు. ఆరేడు నెలల పాటు దీనిపై కూర్చొని దాదాపు 14 కేజీల బంగారాన్ని శాకుంత‌లం సినిమా కోసం రూపొందించినట్టు తెలుస్తుంది. ఇందులో అన్నీ నిజమైన బంగారం, వజ్రాలను వాడినట్టు చెప్పారు గుణ‌శేఖ‌ర్ .

శకుంతల పాత్రకి 15కేజీల బంగారంతో 14 రకాల ఆభరణాలు చేయించ‌గా, దుష్యంతుడి పాత్ర కోసం దాదాపు పది కేజీల బంగారు ఆభరణాలు, మేనక పాత్ర ధారి అయిన మధుబాల కోసం ఆరు కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులను, బంగారు ఆభరణాలను తయారు చేయించామని గుణ‌శేఖ‌ర్ స్ప‌ష్టం చేశారు. ఈ ఆభ‌ర‌ణాల వ‌ల్ల‌నే వారి వారి పాత్ర‌ల‌కు అందం కూడా వ‌చ్చింద‌ని అన్నారు.

also read :

Samantha Latest beautiful Photos from Shaakuntalam movie

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News