medico preethi case : మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రీతి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అసలేం జరిగిందనే దానిపై ప్రధాన నిందితుడు సైఫ్ నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నారు. తాజాగా సైఫ్ ఈ కేసుపై నోరు విప్పాడని తెలుస్తోంది. ఒక్కో అంశంపై క్లియర్‌గా పోలీసులకు తెలియజేశాడట. శుక్రవారం సైఫ్‌ను సుదీర్ఘంగా విచారణ చేసిన పోలీసులు.. నోరు విప్పకపోవడంతో తమదైన శైలిలో విచారించారు. అనంతరం నిజాలు ఒక్కొక్కటిగా బయటకు చెప్పేశాడని తెలుస్తోంది.
ఈ క్రమంలో సంచలన అంశాలను సైఫ్ చెప్పాడని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ పోలీసులు రికార్డు చేసుకున్నారు. ఈ ఆధారాలతోనే కీలక సమాచారాన్ని సేకరించినట్లు చెబుతున్నారు. మెడికో ప్రీతి కేసుకు సంబంధించి ప్రీతికి చెందిన సెల్‌ఫోన్ రెడ్ మీ ఎంఐ10 లైట్ బ్లూ కలర్ సెల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అనేక అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రీతికి చెందిన మొబైల్ నుంచి తీసిన 27 స్క్రీన్ షాట్లను, మెసేజ్‌లను పోలీసులు సేకరించారు.
ఇక ప్రీతి మొబైల్‌లోని ఎల్‌డీడీ, నాకౌట్ వాట్సప్ గ్రూపుల నుంచి మూడు, డాక్టర్ గాయత్రి, డాక్టర్ సంధ్య వద్ద ఒక్కొక్కరి నుంచి మూడు మెసేజ్‌లతో కీలక సమాచారాన్ని సేకరించారని సమాచారం. మరోవైపు డాక్టర్ వైశాలి నుంచి ఆరు, డాక్టర్ సంధ్య నుంచి పది, డాక్టర్ స్పందనతో పాటు నిందితుడు సైఫ్ నుంచి ఒక్కో చాట్‌ను సేకరించిన పోలీసులు.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. వీరితో పాటు మొబైల్ టెక్నీషియన్ పెద్దోజు శివచైతన్య సాయంతో మెడికో ప్రీతి చాటింగ్‌పై కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
విచారణ స్పీడప్ చేసిన పోలీసులు.. ఆరాధారాలను చకచకా సేకరిస్తున్నారు. సాకేంతిక ఆధారాలతో పోల్చి నిందితుడు సైఫ్‌కు ప్రశ్నలు వేస్తున్నారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది అందించిన సమాచారంతో విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలం వద్ద ఉన్న ఎంజీఎం హెడ్ నర్సు సునీత, స్టాఫ్ నర్సు చిన్నపల్లి కళాప్రపూర్ణ నుంచి కూడా వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రీతికి చెందని బ్లాక్ కలర్ షోల్డర్ బ్యాగు కీలకంగా మారిందని తెలుస్తోంది. బ్యాగులోని మొత్తం 24 ఆధారాలతో కేసును విచారణ చేస్తున్నారు. ఈ బ్యాగులో ఉన్న మాజా కూల్ డ్రింక్ బాటిల్ అనుమానాస్పదంగా ఉందని తెలుస్తోంది. ఇక బ్యాగులో ఉన్న మరిన్ని వస్తువుల గురించి సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
also read :
Samantha : కష్టకాలంలో సమంతనే అండగా నిలిచిందంటూ చిన్మయి ఆసక్తికర కామెంట్స్
Flax Seeds : అవిసె గింజలతో మీ కొవ్వును కరిగించుకోండి..
Manchu Manoj and Bhuma Mounika Reddy Wedding Photos
Viral video : దానికదే స్టార్ట్ అయిన ట్రాక్టర్.. దెయ్యం తోలిందా? వీడియో వైరల్!