HomesportsIndia: రెస్ట్ పేరుతో సీనియ‌ర్ల‌పై వేటు.. ఐపీఎల్‌కి అలిసిపోని క్రికెట‌ర్స్ టీమిండియాకి ఆడుతున్న‌ప్పుడు అలిసిపోతున్నారా అంటూ ఫైర్

India: రెస్ట్ పేరుతో సీనియ‌ర్ల‌పై వేటు.. ఐపీఎల్‌కి అలిసిపోని క్రికెట‌ర్స్ టీమిండియాకి ఆడుతున్న‌ప్పుడు అలిసిపోతున్నారా అంటూ ఫైర్

Telugu Flash News

India: గ‌త కొన్నాళ్లుగా టీమిండియా చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తుంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పూర్తిగా తేలిపోయిన ఇండియా టీం న్యూజిలాండ్‌లోను చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చింది. ఇక బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌లో వ‌న్డే సిరీస్ కోల్పోయిన ఈ జ‌ట్టు టెస్ట్ సిరీస్ చాలా క‌ష్టంగా గెలిచింది. అయితే త్వ‌ర‌లో శ్రీలంక‌తో మ్యాచ్‌లు ఉండ‌నుండ‌గా, రెస్ట్ పేరుతో సీనియ‌ర్స్‌ని ప‌క్క‌న పెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌కి దూరంగా ఉన్న రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్‌ టూర్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక‌ కివీస్ సిరీస్‌లో ఆడిన సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, బంగ్లాదేశ్ టూర్‌కి దూరంగా ఉన్నాడు…

ఇలా అనధికారికంగా రొటేషన్ పద్ధతి ఫాలో అవుతున్న టీమిండియా మేనేజ్‌మెంట్, టీమ్ కాంబినేషన్‌ని రకరకాలుగా మారుస్తూ వ‌స్తుంది. బంగ్లాదేశ్‌లో వన్డే సిరీస్ ఓడిన తర్వాత ఈ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు చేశారు సీనియర్లు… ఐపీఎల్ ఆడినప్పుడు అలిసిపోని క్రికెటర్లు, టీమిండియా ఆడినప్పుడు మాత్రం ఎందుకు అలిసిపోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెస్ట్ కావాలని కోరుకుంటే ఐపీఎల్ సమయంలో విశ్రాంతి తీసుకోవాలని, టీమిండియాకి ఆడుతున్నప్పుడు ప్రతీ మ్యాచ్‌కి అందుబాటులో ఉండాలని భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు… వచ్చే ఏడాది జనవరి 3 నుంచి శ్రీలంకతో స్వదేశంలో టీ20 సిరీస్ ఆడనుంది.. ఈ సిరీస్ నుంచి సీనియర్లకు రెస్ట్ ఇవ్వాలని టీమిండియా డిసైడ్ అయినట్టు సమాచారం…

బంగ్లాదేశ్‌ టూర్‌లో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ, పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అయితే రోహిత్‌ని టీ20లకు దూరంగా పెట్టడమే బెటర్ అని బీసీసీ భావిస్తుండ‌గా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా పక్కనబెట్టబోతున్నట్టు సమాచారం.. అలాగే కెఎల్ రాహుల్ కూడా శ్రీలంకతో టీ20 సిరీస్‌కి దూరంగా ఉండబోతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అథియా శెట్టిని ఆమెను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ పెళ్లి కోసం కొన్నాళ్లు బ్రేక్ కావాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ని కోరాడట కెఎల్ రాహుల్. టీ20 సిరీస్‌కి దూరంగా ఉండే సీనియర్లు, వన్డే వరల్డ్ కప్ 2023 ఉన్న నేపథ్యంలో వన్డే సిరీస్‌లో పాల్గొంటారని టాక్..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News