మన దేశం నుంచి వెళ్లి మన దేశ గౌరవాన్ని, కీర్తిని పెంచిన వారిలో మైక్రో సాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (satya nadella) ఒకరు. 1967,అగస్ట్ 19న యుగందర్ నాదెళ్ల అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కు హైదరాబాద్ లో జన్మించిన సత్యనారాయణ నాదెళ్ల చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండేవారట.
అదే విధంగా కేవలం చదువుకే పరిమితం కాకుండా ఆటలలోను అదీ ముఖ్యంగా క్రికెట్ లోనూ అమితమైన ఇష్టాన్ని కనపరిచేవారట. తన ప్రాథమిక విద్యనంతా హైదరాబాద్ లోని బేగంపేటకు చెందిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో(హెచ్‌పీఎస్) ముగించగా 1988లో కర్ణాటకలోని మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
ఆపై 1990లో అమెరికాకు వెళ్లి ఎమ్.ఎస్ (M.S) చేసిన సత్య సన్ మైక్రోసిస్టమ్స్ అనే సంస్థలో పని చేయడం మొదలు పెట్టారు. ఆ తరువాత 1992లో మైక్రో సాప్ట్ లో చేరిన ఆయన 1997లో యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎమ్.బి.ఏ పూర్తి చేశారు.
ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన తండ్రికి తెలిసిన మరో ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ కూతురైన అనుపమను సత్య వివాహమాడి వాషింగ్టన్లో స్థిర పడ్డారు.
కొంత కాలానికి వారి ప్రేమకు గాను ఇద్దరు అమ్మాయిలు,ఒక అబ్బాయి జన్మించగా పుట్టుకతోనే కండరాలకు సంబంధించిన వ్యాధి(cerebral palsy)తో బాధపడుతున్న వాళ్ళ కుమారుడు జైన్ నాదెళ్ల 26 ఏళ్లకే 2022,ఫిబ్రవరి 28న ఆరోగ్యం విషమించడంతో చనిపోయాడు.
Satya Nadella మైక్రోసాఫ్ట్ ప్రయాణం:
1992లో బిల్ గేట్స్ తరువాత మైక్రోసాఫ్ట్ కు రెండోవ సీఈఓగా పదవికెక్కిన స్టీవ్ బామర్ 2015 సంవత్సరంలో సీఈఓ పదవి నుంచి దిగిపోతానని ప్రకటించడంతో 3వ సీఈఓగా ఎవరు వస్తారా అని అందరూ ఆతృతగా ఎదురు చూశారు.
ఆ తరుణంలోనే ఎంతో కాలంగా మైక్రోసాఫ్ట్ లో పని చేస్తూ ఆ సంస్థ అభివృద్దిలో బిల్ గేట్స్,స్టీవ్ బామర్ల తరువాత అంతటి ప్రధాన పాత్ర పోషించిన సత్య నాదెళ్లనే 3వ సీఈఓ అని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
2014లో సీఈఓగా పదవి చేపట్టిన ఆయన ఆనందాన్ని పంచుకుంటూ టెక్నాలజీతో ప్రపంచాన్నే మార్చేస్తున్న మైక్రోసాఫ్ట్ కు సీఈఓ గా మారడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు.
ఆయన గురించి స్టీవ్ బామర్ మాట్లాడుతూ “సత్య నాదెళ్లతో ఎంతో కాలం నుంచి కలిసి పనిచేస్తున్నాను. మైక్రోసాప్ట్ ఎదుగుదలలో మాలాగే ఆయన కూడా ప్రధాన పాత్ర పోషించారు. మైక్రోసాఫ్ట్ కు సరైన సమయంలో సరైన సీఈఓ వచ్చాడు” అంటూ సత్య నాదెళ్ల పై ప్రశంసల వర్షం కురిపించారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు మైక్రోసాప్ట్ ను అభివృద్ది పరచడంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా అదరగొడుతున్న సత్య నాదెళ్ల ప్రతి దశలలోను అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వచ్చారు. గత ఏడాది 2021లో భారత ప్రభుత్వం సత్య నాదెళ్లకు పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేయడంతో సత్య నాదెళ్ల మరింత ఆనందపడ్డారు.
సత్య నాదెళ్ల ఇంతటి స్థాయికి చేరడం భారత దేశానికి గర్వకారణం అయితే ఆయన ఒక తెలుగోడు కావడం మన తెలుగు వాళ్ళంతా మరింత ఆనందించాల్సిన విషయం.
also read news:
Pomegranate Peel : దానిమ్మ తొక్కలతో ఛాయ్.. రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
Kl Rahul: లక్కంటే కేఎల్ రాహుల్‌దే.. ఈ ఉదాహరణలు చూశాక ఒప్పుకోక తప్పదు..!