Saturday, May 11, 2024
Homecinemaప్రభాస్ 'స్పిరిట్' సినిమా గురించి సందీప్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా గురించి సందీప్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Telugu Flash News

సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి వరుస పరాజయాల తర్వాత ప్రభాస్ సలార్‌తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. దేశవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ప్రభాస్ తర్వాతి చిత్రాలపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే సలార్ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ సాధించే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కల్కీ, మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్, సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

ప్రభాస్ యొక్క తదుపరి చిత్రం స్పిరిట్‌పై కూడా అభిమానుల నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దర్శకుడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి సంచనాలకు మారుపేరుగా నిలిచిన సందీప్, తాజాగా యానిమల్‌ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. యానిమల్ సినిమాతో సందీప్ బాలీవుడ్‌లో తన సత్తాను మరోసారి రుజువు చేశాడు.

తాజాగా దర్శకుడు సందీప్ వంగ స్పిరిట్ మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. స్క్రిప్ట్‌కు సంబంధించిన ప్రాథమిక పనులు పూర్తయినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా పూర్వ నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు.

స్పిరిట్ చిత్రాన్ని టీ-సిరీస్‌ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News