Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల తెగ వార్తలలో నిలుస్తూ వస్తుంది. ఆమె సినిమాల కన్నా పర్సనల్ విషయాలతోనే హాట్ టాపిక్ అవుతుంది. సమంత నటించిన గత రెండు చిత్రాల్లో యశోద, శాకుంతలం ఉండగా, అందులో యశోద మాత్రమే మంచి టాక్ అందుకోగా, శాకుంతలం నిరాశపరచింది. అయితే యశోద విడుదలకు ఒక వారం రోజుల ముందు నాకు భయంకరమైన వ్యాధి అంటూ సమంత చెప్పడం కలిసొచ్చింది. యశోద మంచి హిట్ కొట్టింది.
అయితే అదే సింపతీ ప్లాన్ శాకుంతలం మూవీకి కూడా వాడే ప్రయత్నం చేస్తూ.. శాకుంతలం ప్రమోషన్స్ లో కొత్త అవతారం ఎత్తింది. తెల్ల బట్టలు, జపమాలతో కనిపిస్తూ… ప్రమోషనల్ ఈవెంట్స్ లో కన్నీరు కార్చింది.
దగ్గుతూ కనీస ఓపిక లేదని మీడియా ముందు తన అనారోగ్య పరిస్థితి గురించి చెబుతూ ఎమోషనల్‌గా మట్లాడింది. శాకుంతలం విడుదలకి రెండు రోజుల ముందు సమంత తనకు జ్వరం సోకినట్లు కూడా ట్వీట్ చేశారు. అయితే రీసెంట్‌గా సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ లో సరికొత్తగా కనిపించింది.
వారం రోజుల క్రితం జ్వరం, తీవ్ర నీరసమని చెప్పిన సమంత విదేశాలకు ఎలా వెళ్లారని ఆమెని ప్రశ్నిస్తూ అనారోగ్య కథలు అంతా ఒట్టివే అని తిట్టిపోస్తున్నారు.
also read :
Samantha Latest beautiful Photos from Shaakuntalam movie
Samantha: ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే సమంత అన్ని కోట్లు సంపాదిస్తుందా..!