HomecinemaSamantha: పూల వ‌ల‌న స‌మంత ఒంటిపై రాషెస్.. షూట్‌లో అంత ఇబ్బంది ప‌డిందా?

Samantha: పూల వ‌ల‌న స‌మంత ఒంటిపై రాషెస్.. షూట్‌లో అంత ఇబ్బంది ప‌డిందా?

Telugu Flash News

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత న‌టించిన తాజా చిత్రం శాకుంత‌లం. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా ఏప్రిల్ 14న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. కొద్ది రోజులుగా సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు సాగుతున్నాయి. చిత్ర ప్ర‌మోష‌న్స్ లో భాగంగా స‌మంత ఈ మూవీకి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలను చెబుతూ వ‌స్తుంది.

తాజాగా ట్విట్టర్​లో పోస్ట్​ చేసిన ఓ వీడియోలో సామ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. సమంతకు పూల ఎలర్జీ ఉందట. ఈ సినిమాలో తాను ధరించిన కొన్ని పూల వల్ల చేతికి మొత్తం ర్యాషెస్ వచ్చాయని, అదొక ఫ్లవర్ టాటూలాగా కనిపించేదని స‌మంత చెప్పుకొచ్చింది . ఆరు నెలల పాటు అది అలాగే ఉండిపోగా, షూటింగ్​లో కనిపించకుండా ఉండేందుకు దానిపై మేకప్ చేసినట్లు పేర్కొంది స‌మంత‌.

ఇక శకుంతల పాత్ర నేటి అమ్మా యిలకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంద‌ని, ఈ శకుంతల పాత్ర చేయటం అనేది నటిగా నాకు ఓ పెద్ద బాధ్యత అని సామ్ కీల‌క విష‌యాలు వెల్ల‌డించింది. ఈ సినిమా కోసం సమంత సొంతంగా మూడు భాషల్లో డబ్బింగ్ చెప్ప‌గా, ఇది చాలా కష్టమైన పని అని పేర్కొంది.

also read:

Samantha Latest Photos Shakuntalam Movie Promotions

Samantha Latest beautiful Photos from Shaakuntalam movie

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News