Sunday, May 19, 2024
HomecinemaNaga Chaitanya:నాగ చైతన్య‌కి చుక్క‌లు చూపించిన స‌మంత ఫ్యాన్స్.. ఏం చేశారంటే..!

Naga Chaitanya:నాగ చైతన్య‌కి చుక్క‌లు చూపించిన స‌మంత ఫ్యాన్స్.. ఏం చేశారంటే..!

Telugu Flash News

Naga Chaitanya:ఒక‌ప్పుడు ఎంతో అన్యోన్యయంగా ఉన్న స‌మంత‌, నాగ చైత‌న్య ఇప్పుడు బ‌ద్ధ శత్రువులుగా మారారు. ఒక‌రి బ‌ర్త్ డేకి ఇంకొక‌రు విషెస్ కూడా చెప్పుకోవ‌డం లేదు. వీరితో పాటు వీరి ఫ్యాన్స్ మ‌ధ్య కూడా దూరం పెరిగింది. తాజాగా నాగ చైత‌న్య‌కి స‌మంత ఫ్యాన్స్ చుక్క‌లు చూపించారు. నాగచైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ 12 వ తేదీన తెలుగు మరియు తమిళం బాషలలో విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు చైతూ.

ఈ క్ర‌మంలో తమిళం లో కూడా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈవెంట్‌లో నాగ చైతన్య తమిళంలో అద్భుతంగా మాట్లాడుతూ స్పీచ్ ఇస్తున్న సమయం లో ఆడియన్స్ లో ఒక గుంపు గా కూర్చున్న కొంతమంది, సమంత అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తూ ఆయ‌న్ని డిస్ట్ర‌బ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. కానీ నాగ చైతన్యు ఆ నినాదాలను పట్టించుకోకుండా తన స్పీచ్ కొన‌సాగించాడు. ఈ విష‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సమంత కి తెలుగుతో పాటుగా తమిళంలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విష‌యం తెలిసిందే.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News