Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో సమంత ఒకరు. ఇటీవల ఈ అమ్మడు సోలో చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు సమంత సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోను సందడి చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతని రెండున్నర కోట్ల మంది ఫాలో అవుతుంటే, ట్విట్టర్లో కోటీ మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ఫేస్‌బుక్‌తో కలిసి ఆమెకి సుమారు నాలుగు కోట్ల ఫాలోవర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆమె ఫాలోవర్సే ఇన్కమ్ సోర్స్‌గా కూడా మారడం విశేషం. సమంత తన సోషల్ మీడియాలో కమర్షియల్ పరంగా చేసే ఒక్క పోస్ట్‌కి ఇరవై లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందట.
మరోవైపు సమంత రియల్ ఎస్టేట్ బిజినెస్‌తో పాటు సాకీ అనే ఆన్లైన్ ఫ్యాషన్ బ్రాండ్, ఏకమ్ ఎర్లీ లెర్నింగ్ ఎడ్యూకేషన్ సెంటర్స్‌ని రన్ చేస్తుంది. సూపర్ ఫుడ్ సంస్థలో కూడా కొంత ఇన్వెస్టిమెంట్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఏకంగా ఏడాది రెండు మిలియన్ డాలర్లు అందుకుంటుందని టాక్.
also read :
Amazon : అమెజాన్ సమ్మర్ సేల్‌లో బంపర్ ఆఫర్.. ఐఫోన్‌పై భారీ తగ్గింపు!
Ambati Rayudu : నా ఉద్దేశం అది కాదు.. ట్వీట్‌పై అంబటి రాయుడు వివరణ!