Saturday, May 11, 2024
HomebusinessAmazon : అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌లో బంపర్‌ ఆఫర్‌.. ఐఫోన్‌పై భారీ తగ్గింపు!

Amazon : అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌లో బంపర్‌ ఆఫర్‌.. ఐఫోన్‌పై భారీ తగ్గింపు!

Telugu Flash News

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (amazon) ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో ముందుకొస్తోంది. తాజాగా గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ (Great summer sale) కు సిద్ధమైంది. అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్ సేల్‌ మే 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలు కానుంది.

ప్రైమ్‌ యూజర్లు ఒక రోజు ముందే ఇందులో పాల్గొనే చాన్స్‌ కల్పిస్తోంది అమెజాన్. అయితే, ఎన్నిరోజుల పాటు ఈ సేల్‌ నిర్వహించేదీ అమెజాన్ వెల్లడించలేదు. ఈ సేల్‌లో మొబైల్స్‌, ఇతర ఉత్పత్తులను తక్కువ ధరలకే అమెజాన్ విక్రయించనుంది.

అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ మహాంద్రా బ్యాక్‌ డెబిట్‌కార్డు/ క్రెడిట్‌కార్డు దారులకు 10 శాతం ప్రత్యేక తగ్గింపు ఉంటుంది. ముఖ్యంగా ఐఫోన్‌ 14 తో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్లపై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది అమెజాన్.

శాంసంగ్‌ గెలాక్సీ ఎం35 5జీ ఫోన్‌ ఎమ్మార్పీ రూ.24,999 కాగా.. ఈ సేల్‌లో రూ.14,999కే విక్రయించనుండటం విశేషం. శాంసంగ్‌ గెలాక్సీ ఎం04 ఫోన్ రూ.6,999కే కష్టమర్లు దక్కించుకోవచ్చు. ఈ సేల్‌లో వన్‌ప్లస్‌ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్‌ కూడా ఇస్తోంది.

వన్‌ప్లస్‌ 10ఆర్‌ 5 జీ ఫోన్‌ రూ.34,999కే దక్కించుకోవచ్చు. మార్కెట్‌లో కొత్తగా విడుదలైన వన్‌ప్లస్‌, షావోమీ, ఒప్పో, వివో బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లను కూడా తగ్గింపు ధరకే ఈ సేల్‌లో కొనొచ్చు. ఐఫోన్‌ 14పై భారీ డిస్కౌంట్‌ ఉండబోతోందని అమెజాన్‌ తెలిపింది. అయితే, డిస్కౌంట్‌ ఎంతనేది క్లారిటీ ఇవ్వలేదు. దీంతోపాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లపై 75 శాతం వరకు తగ్గింపు ఉంటుందని అమెజాన్‌ తెలిపింది.

also read :

-Advertisement-

Ambati Rayudu : నా ఉద్దేశం అది కాదు.. ట్వీట్‌పై అంబటి రాయుడు వివరణ!

Ramoji Rao : రికార్డులు దొరక్కుండా జూమ్‌ ద్వారా కౌన్సెలింగ్‌.. డిలీట్‌ చేయాలని రామోజీ ఆదేశం!

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News