God Father: లూసిఫర్ రీమేక్‌గా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలలో మోహన్ రాజా తెరకెక్కించిన చిత్రం గాడ్ ఫాదర్. దసరా కానుకగా అక్టోబర్ 5న గాడ్‌ఫాదర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేయగా, సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడంతో హిందీలో ఈ సినిమాపై అంచనాలు భారీఆనే ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ చిత్రం ప్రచారకార్యక్రమాలను ప్రారంభించింది చిత్రబృందం. రీసెంట్‌గా ప్రీరిలీజ్ ఈవెట్ జరుపుకున్న చిత్ర బృందం,హిందీలోను భారీ ఎత్తున వేడుక నిర్వహించింది.
సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్..
అయితే ఈ చిత్రంలో స్పెషల్ రోల్ కి గాను సల్మాన్ ఖాన్ నటించడంతో హిందీలో కూడా మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాల వారు భావవిస్తున్నారు. అయితే ఇందులో చేసినందుకు సల్మాన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే వార్తపై అనేక ప్రచారాలు జరిగాయి.
అసలు విషయం ఏంటంటే ఈ చిత్రానికి సల్మాన్ అసలు రెమ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం.. ఈ విషయం తెలుసుకొని అందరు చిరు మరియు సల్మాన్ ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎంత గట్టిదో అర్ధం అవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.
గాడ్‌ఫాదర్ అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార ఈ సినిమాలో కీలక పాత్ర పోషించగా, సత్యదేవ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈ సినిమాలో టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది.
తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్బీ చైదురీ, ఎన్వీ ప్రసాద్, సురేఖ కొణిదెల నిర్మిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.