Rohit Sharma:ఇటీవల టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోతుంది. చిన్నచిన్న జట్లపైన కూడా నెగ్గడం చాలా కష్టమవుతుంది. బంగ్లాతో దారుణంగా ఆడి సిరీస్ కూడా కోల్పోయింది. ఏడేళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 1-2తో సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కోల్పోవలసి వచ్చింది. అయితే బుధవారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ కనబర్చిన పోరాటం నా భూతో న భవిష్యత్తు అనే చెప్పాలి. గాయంతో మైదానం వీడిన రోహిత్.. జట్టు కోసం నొప్పిని పంటి బిగువన భరిస్తూ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి పరుగుల వరద సృష్టించడం మనం చూశాం.
అసాధారణ బ్యాటింగ్‌తో అజేయ హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ భారత్‌ను గెలిపించినంత పని అయితే చేశాడు. రోహిత్‌కు మరో ఎండ్‌లో కొంత సహకారం లభించిన కూడా ఈజీగా గెలిచేది. అవతిలి ఎండ్‌లో ఉన్న మహమ్మద్ సిరాజ్ సింగిల్ తీయడానికి నానా తిప్పలు పడడంతో రోహిత్ పోరాటం వృథా అయ్యింది. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన స్థితిలోనూ సిక్స్ బాది ఆశలు రేకెత్తించిన రోహిత్.. ఆఖరి బంతిని సిక్సర్‌గా మలచలేకపోవడంతో భారత్ ఓటమి బాట పట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా.. సిరీస్ కోల్పోయినా.. రోహిత్ పోరాటం అభిమానులకి కావాల్సినంత మజా అయితే అందించింది.
బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా రోహిత్ ఆటను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. సిక్సర్‌తో మ్యాచ్ గెలిపించి ఉంటే గనుక భారత క్రికెట్ చరిత్రలో రోహిత్ ఇన్నింగ్స్ ఓ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌గా నిలిచేది. అయితే రోహిత్ ఫినిషింగ్ స్కిల్స్‌కు ఫిదా అయిన అభిమానులు.. కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు.. రోహిత్ శర్మను ఓపెనర్‌గా ఆడటం కంటే ధోనీలా ఫినిషర్ రోల్ పోషించాలని సూచిస్తున్నారు. జట్టులో ఓపెనర్లు చాలా మంది ఉన్నారని, కానీ ఫినిషర్లే లేరంటూ క ఆమెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ ఫినిషర్ వంటి వారు ఆ పాత్రకు న్యాయం చేయలేకపోయారని అభిప్రాయపడుతున్నారు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. నొప్పితో చెలరేగిన రోహిత్‌ను ఫినిషర్‌గా ఆడిస్తే మంచి ఫలితం ఉంటుందని జోస్యం చెబుతున్నారు. రోహిత్ ఫినిషర్‌గా ఆడితే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు తిరుగుండదని కొందరు చెప్పుకొస్తున్నారు