Bigg Boss 6: బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ రంజుగా సాగుతుంది. గురువారం నాటి 68వ ఎపిసోడ్‌లో కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం తనకి ఇవ్వనందుకు రేవంత్ చాలా హర్ట్ అయ్యాడు. శ్రీసత్య ఈ వారం కెప్టెన్‌గా ఉండగా, తనకి ఇవ్వకుండా శ్రీసత్యకి శ్రీహాన్ ఛాన్స్ ఇచ్చేసరికి మనోడు తెగ కుమిలిపోయాడు. ఇక చివరికి.. రోహిత్, మెరీనా, ఫైమా, శ్రీ సత్య, ఆదిరెడ్డి, కీర్తి.. ఈ ఆరుగురు కెప్టెన్సీ పోటీదారులుగాబరిలోకి దిగారు. రేవంత్ సంచాలక్‌గా ఉంటాడు అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ ప్రకారం పోటీ చేసే సభ్యులకు థర్మాకోల్ బాల్స్ నింపిన గోనె సంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు. వాటిని వీపున మోస్తూ ముందుగా నిర్ణయించిన సర్కిల్స్ లో ఒకరి వెనుక ఒకరు తిరగాలి.
రేవంత్ కండీషన్స్..
ఆ బ్యాగ్స్ కి ఉన్న రంధ్రాల నుంచి థర్మాకోల్ బాల్స్ పడిపోకుండా జాగ్రత్తపడుతూ.. ఇతర సభ్యుల నుంచి రక్షించుకుంటూ సర్కిల్స్ లో తిరగాల్సి ఉంటుంది. సమయం ముగిసే సమయానికి ఎవరి సంచిలో ఎక్కువ థర్మాకోల్ బాల్స్ ఉంటాయో వారు నెక్స్ట్ రౌండ్ కి వెళతారు. అతితక్కువ థర్మాకోల్స్ ఉన్న వారు పోటీ నుంచి తప్పుకుంటారని బిగ్ బాస్ చెప్పారు. అయితే గేమ్‌లో ఫైమా అనేకసార్లు లైన్ క్రాస్ చేసింది.. అది కూడా చూస్తూ ఉండిపోయాడు రేవంత్. అసలు గేమ్ ఏంటో.. ఎలా ఆడించాలో తెలియకుండా.. ఇష్టం వచ్చినట్టు చేసి.. చెత్త సంచాలక్ అనిపించుకున్నాడు రేవంత్.
అయితే రేవంత్ తీరుపై రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నన్ను బ్యాగ్ పట్టుకోవద్దని అంటున్నావ్.. వాళ్లు చేత్తో బ్యాగ్ పట్టుకుంటున్నారు ఏం చూస్తున్నావ్ అని తన బ్యాగ్‌ని విసిరికొట్టేసి.. కోపంతో ఊగిపోయాడు రోహిత్ . బ్యాగ్ విసిరికొట్టాడని రేవంత్ కంప్లైట్ చేశాడు . దీంతో రోహిత్‌ని డిస్ క్వాలిఫై చేశారు. ఓవరాల్‌గా రేవంత్ ఈ కెప్టెన్సీ టాస్క్‌లో పరమ చెత్త సంచాలక్ అని మాత్రం చెప్పొచ్చు. ఈ రోజు హౌజ్ కెప్టెన్ ఎవరనే దానిపై ఓ క్లారిటీ వస్తుంది.
also read news:
Poorna: పూర్ణ భర్త పేరిట మోసాలు.. మాకేమి సంబంధం లేదంటున్న అందాల భామ
గర్భిణులు ప్రొటీన్ కోసం ఏమేం తినాలో తెలుసా ?