HomecinemaRGV: ప్ర‌భాస్ ఫ్యాన్స్ ర‌చ్చ..ఇది దీపావ‌ళి సెల‌బ్రేష‌న్ కాదంటూ వీడియో షేర్ చేసిన వ‌ర్మ‌

RGV: ప్ర‌భాస్ ఫ్యాన్స్ ర‌చ్చ..ఇది దీపావ‌ళి సెల‌బ్రేష‌న్ కాదంటూ వీడియో షేర్ చేసిన వ‌ర్మ‌

Telugu Flash News

RGV: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బ‌ర్త్ డే (prabhas birthday) సెల‌బ్రేష‌న్స్ మాములుగా జ‌ర‌గలేదు. ఇండియాలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రిగాయి. ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయన నటించిన బిల్లా (billa movie) సినిమాని రీ రిలీజ్ చేశారు. ఈ క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లలో అయితే పండుగ వాతావరణం నెలకొంది. కొంద‌రు అభిమానులు బాణాసంచా కాలుస్తూ దీపావ‌ళి పండుగ‌ని థియేట‌ర్స్ ద‌గ్గ‌రే జ‌రుపుకున్నారు. అయితే తాడేపల్లి గూడానికి సంబంధించిన వెంకట్రామా అనే థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ బిల్లా సినిమా రిలీస్ సందర్భంగా హంగామా సృష్టించారు. త‌మ అభిమానాన్ని కాస్త వెరైటీగా చాటుకోవాలని భావించారు.

రచ్చ రచ్చ‌..

బాణాసంచాని థియేటర్ బయట రోడ్లమీద కాల్చ‌కుండా లోపల కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అది బెడిసి కొట్టింది, థియేటర్ లో వెలిగించిన బాణాసంచా అక్కడ ఉన్న సీట్లకు అంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి.

ఈ నేపథ్యంలో ఆ సీట్లన్నీ దగ్ధమ‌య్యాయి. దాదాపుగా థియేటర్ కూడా దగ్ధమయ్యే పరిస్థితికి చేరుకుంది. వెంట‌నే ఫైర్ ఇంజిన్ అక్క‌డికి చేరుకొని మంటు ఆర్ప‌డంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఇక ఇందుకు సంబంధించిన మరో వీడియోని రామ్ గోపాల్ వ‌ర్మ‌ (ram gopal varma) త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, అభిమానులు సినిమా హాలులో పటాకులు పేల్చడం కనిపించింది. వారిలో కొందరు స్క్రీన్ దగ్గర పైకి ఎక్కి, తమ చేతుల్లో ప్రభాస్ పోస్టర్లతో డ్యాన్స్ చేయడం గ‌మ‌నించ‌వచ్చు.

-Advertisement-

ఈ క్లిప్‌కి వ‌ర్మ‌.. ఇది దీపావళి వేడుక కాదు.. ప్ర‌భాస్ సినిమా తెరపై నడుస్తున్నప్పుడు థియేటర్‌ను తగలబెట్టి సంబరాలు చేసుకోవడం.. ప్రభాస్ అభిమానుల పిచ్చి అంటూ వ‌ర్మ కామెంట్‌లో తెలిపారు. ఏదేమైన ఇటీవ‌ల కాలంలో అభిమానుల పైశాచిక‌త్వం మ‌రింత ఎక్కువైంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చూడండి :

చియా విత్తనాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

బరువు తగ్గాలంటే ఈ స్నాక్స్ తినాల్సిందే.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News