HomecinemaRewind 2022 : ఈ ఏడాది బాలీవుడ్ లో బోల్తా పడిన సినిమాల గురించి తెలుసుకోండి.

Rewind 2022 : ఈ ఏడాది బాలీవుడ్ లో బోల్తా పడిన సినిమాల గురించి తెలుసుకోండి.

Telugu Flash News

Rewind 2022: ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర చాలా ఘోరంగా విఫలమవుతున్నాయి. సరైన కథలున్న సినిమాలు రాక,వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించ లేక బాలీవుడ్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది.ఆఖరికి స్టార్ హీరోల సినిమాలు కూడా బోర్లా పడుతున్నాయి అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.అసలు ఆ హీరోలు ఎవరో….అవి ఏ సినిమాలో తెలుసుకోవాలి అంటే ఇది చదవాల్సిందే.

జయేష్భాయ్ జోర్దార్

బాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన సినిమా “జయేష్భాయ్ జోర్దార్” మొదట్లో భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది ఈ సినిమా.రణ్వీర్ సింగ్ తన నటనతో కొంత వరకు సినిమాను లాకొచ్చినప్పటికీ ఈ సినిమా ఆశించిన ఫలితాలు చూపించలేకపోయింది.

బ్రహ్మస్త్ర

“వేక్ అప్ సిడ్” “ఏ జవానీ హై దివాని” లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు ఆయన్ ముఖర్జీ తెరకెక్కించిన “బ్రహ్మస్త్ర” భారీ అంచనాల నడుమ విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ తరువాత ప్రేక్షకులను ఆకట్టుకోలేక చప్ప బడిపోయింది. ఆసక్తి కలిగించలేని కథనంతో, సన్నివేశాలతో ఏ మాత్రం మెప్పించలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల పడింది.

ధాకడ్

ఇక బాలవుడ్ రౌడీ లేడి కంగనా రనౌత్ నటించిన “ధాకడ్” కూడా ఒక వింత ప్రయోగంగా వచ్చి అంతంత మాత్రంగానే ఆడి వెళ్ళిపోయింది.ట్రైలర్ తో ఒక కొత్త కథతో వస్తున్నారని అని అనిపించినప్పటికీ ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించలేకపోయింది.

లాల్ సింగ్ చడ్డా

హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్” కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాతో నైనా అమీర్ ఖాన్ బాలీవుడ్ రాత మారుస్తాడు అనుకున్నారంతా.కానీ ఈ సినిమా కూడా సక్సెస్ సాధించలేకపోయింది.మొదటి నుంచి చివరి వరకు అసలు ప్రేక్షకుడికి కనెక్ట్ కాకుండానే ముగిసి పోయే ఈ సినిమా సరైన కథ తో వస్తే తప్ప ప్రేక్షకుడు చూడడు అని మరో సారి అందరికీ అర్థమయ్యేలా చేసింది.

సామ్రాట్ పృథ్వీరాజ్

దర్శకుడు చంద్రప్రకాష్ ద్వివేది తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందే అందరి ప్రశంసలను పొందినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశాజనకంగా కనిపించలేదు.అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో ఈ సినిమాలో ఉన్నా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు చతికిల పడింది.ఇదే ఏడాదిలో అక్షయ్ కుమార్ నటించిన “రక్షాబంధన్” కూడా సక్సెస్ సినిమాల జాబితాలో చెరలేకపోయింది.

-Advertisement-

విక్రమ్-వేద

అర్.మాధవన్,విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించిన తమిళ్ సినిమాకు అదే పేరుతో రీమేక్ గా వచ్చిన “విక్రమ్-వేద” కూడా ఈ ఏడాది ఆశించిన ఫలితాలు చూపించలేక పోయింది. హృతిక్ రోషన్,సైఫ్ అలీ ఖాన్ లాంటి పెద్ద తారలు ఉన్న ఈ సినిమా కూడా అంతంత మాత్రంగానే ఉండి ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.ఎమోషన్ పండించలేక,సరైన సన్నివేశాలు చూపక ప్రేక్షకుల నుండి ఈ సినిమా తిరస్కరించబడింది.

also read news: 

america weather today : అమెరికాలో ‘బాంబు తుఫాను’..భరించలేని చలి..గజగజ వణుకుతున్న అగ్రరాజ్యం

Christmas : ఏటా డిసెంబర్‌ 25 నే క్రిస్మస్‌ ఎందుకు జరుపుకుంటారు? బాక్సింగ్‌ డే ప్రత్యేకత ఏంటి?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News