HomerecipesRecipe: మునగాకు, కందిపప్పు రెసిపీ.. ఇలా ట్రై చేయండి

Recipe: మునగాకు, కందిపప్పు రెసిపీ.. ఇలా ట్రై చేయండి

Telugu Flash News

Recipe: సాధారణంగా పప్పును మనదేశంలో చాలా మంది నిత్యం చేసుకుంటూ ఉంటారు. పప్పు రెసిపీలోనూ చాలా వెరైటీలు చేసుకోవచ్చు. కందిపప్పు ఉంటే చాలు.. అందులోకి ఎన్నో వెరైటీలు కలిపి వైవిధ్యంగా చేసుకొని ఆరగిస్తుంటారు. మునగాకు, కందిపప్పు కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా? ఎందుకంటే మునగాకు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగు పరచడంలో దోహదం చేస్తుంది. అలాగే, అధిక బరువు, కొవ్వు కరిగించేందుకు, పొట్టలో ఉన్న ఇన్ఫెక్షన్లు, మూత్రాశయంలో రాళ్లను కరిగించేందుకు కూడా ఉపయోగపడుతుంది.

మునగాకు కందిపప్పు చేసుకోవడానికి మునగాకు, కందిపప్పు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, నూనె, పసుపు, ఉప్పు, ఇంగువ, కరివేపాకు రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు అవసరం అవుతాయి. తొలుత ఓ కుక్కర్‌ను తీసుకోవాలి. అందులో కడిగి నానబెట్టుకున్న కందిపప్పును, మునగాకులను, కరివేపాకు రెమ్మలను, కట్‌ చేసిన ఉల్లిపాయను, పచ్చిమిర్చి, ఓ టీస్పూన్‌ పసుపు, టమాటా ఒకటి… ఇవన్నీ వేసేయాలి.

తర్వాత ఓ గ్లాసు కందిపప్పునకు రెండు గ్లాసుల నీళ్లు చొప్పున పోసి కుక్కర్‌ మూత పెట్టి స్టవ్‌ ఆన్‌ చేసుకోవాలి. నాలుగు విజిల్స్‌ వచ్చే దాకా ఉడికించుకోవాలి. అనంతరం కుక్కర్‌ ఓపెన్ చేసి రుచికి సరిపడా ఉప్పు, చింతపండు వేడి నీళ్లలో నానబెట్టి రసం వేసి బాగా కలపాలి. పప్పు గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి.

నూనె వేడి అయ్యాక తాలింపు గింజలు, జిలకర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు రెమ్మలు, కాస్త ఇంగువ వేసి కలుపుకోవాలి. తాలింపు మగ్గిన అనంతరం మునగాకు పప్పు వేసి మిక్స్‌ చేసుకోవాలి. రెండు నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్‌ చేసుకోవాలి. ఓ ఐదు నిమిషాల తర్వాత దించేసుకొని వేడి వేడి అన్నంలో మునగాకు కందిపప్పు కర్రీ వేసుకొని ఆస్వాదిస్తూ తినేయండి. ఈ రెసిపీతో ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. తప్పనిసరిగా ఓసారి ఈ రెసిపీ ట్రై చేయండి.

Read Also : Devotional: సనాతన ధర్మం ప్రకారం నిత్య పూజ ఎలా చేసుకోవాలి?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News