Ray Stevenson : గత కొంత కాలంగా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరి మృతిని మరచిపోకముందే మరొకరు కన్నుమూస్తున్నారు. రీసెంట్‌గా సంగీత దర్శకుడు రాజ్, ప్రముఖ నటుడు శరత్ కుమార్ మృత్యువాత పడ్డారు. ఇక ప్రముఖ కమెడీయన్ సుధాకర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడని వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి నడుమ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నటుడు షూటింగ్ లో మృత్యువాత పడడం అందరిని కలిచి వేస్తుంది.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్రిటిష్ ఎంపరర్ స్కాట్ గా ప్రధాన పాత్ర పోషించిన రే స్టీవెన్‌సన్ 58 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో ఒక్కసారిగా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఆయన మరణానికి గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఈ ఐరిష్ నటుడు తన కెరీర్‌లో అనేక బహుముఖ పాత్రలను పోషించి మెప్పించాడు.
రే స్టీవెన్‌సన్ ఆర్ఆర్ఆర్ లో గవర్నర్ స్కాట్ బక్స్‌టన్‌గా నటించినందుకు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. అతను ఎనిమిదేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో, అతను తన నటనా వృత్తిని కొనసాగించడానికి ముందు లండన్‌లోని ఒక ఆర్కిటెక్చర్ సంస్థలో ఇంటీరియర్ డిజైనర్ గా పని చేశాడు.
అనంతరం బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్‌లో చేరాడు . ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో పట్టభద్రుడు కాగా ఆ తర్వాత పలు సినిమాలు చేసి ప్రేక్షకులని మెప్పించాడు. ఆయన కింగ్ ఆర్థర్ (2004), ది అదర్ గైస్ (2010), థోర్ (2011), ది ట్రాన్స్‌పోర్టర్: రీఫ్యూయెల్డ్ (2015), యాక్సిడెంట్ మ్యాన్ (2018) వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. ఆయన ఆకస్మిక మరణంతో చిత్ర సీమలో విషాదం అలుముకుంది.
ఆంటోయిన్ ఫుక్వా 2004 అడ్వెంచర్ మూవీ “కింగ్ ఆర్థర్ష రే స్టీవెస్ సన్ మొదటి ప్రధాన చలనచిత్రం. నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్‌లో ఒకటైన డాగోనెట్‌గా కూడా ఆయన నటించాడు. 2008లో, స్టీవెన్సన్ వరుసగా పలు యాక్షన్ వార్ సినిమాల్లో నటించి ప్రేక్షకులని అలరించాడు. స్టీవెన్సన్ తెరపై పనిషర్ పాత్రను పోషించిన మూడవ నటుడుగా నిలిచాడు. అయితే తను తన పుట్టినరోజుకు కేవలం 2 రోజుల ముందు చనిపోవడం చాలా హృదయ విదారకంగా ఉందని సినీ వర్గాలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
also read :
Gold Rates Today : నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (23-05-2023)
Weather Today (23-05-2023): తెలుగు రాష్ట్రాలకు కాస్త చల్లటి కబురు.. నేటి వాతావరణం ఇలా..