HomecinemaRavi Teja: మాస్ మ‌హ‌రాజా ప‌రిస్థితి ఏంది ఇలా అయింది.. రేస్‌లో ఉన్న‌ట్టా, లేన‌ట్టా?

Ravi Teja: మాస్ మ‌హ‌రాజా ప‌రిస్థితి ఏంది ఇలా అయింది.. రేస్‌లో ఉన్న‌ట్టా, లేన‌ట్టా?

Telugu Flash News

Ravi Teja: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ర‌వితేజ ఆన‌తి కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడు. మాస్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ వ‌స్తున్నాడు. ఇటీవ‌ల కాలంలో ర‌వితేజ‌కి స‌క్సెస్ అనేది పెద్ద‌గా లేదు. ఈ ఏడాది రమేష్ వర్మ రూపొందించిన ఖిలాడీ , శరత్ మండవ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రామారావు అన్ డ్యూటీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణంగా నిరాశ‌ప‌రిచాయి. ఫ్లాప్స్ వ‌స్తున్నా కూడా ర‌వితేజ జోరు త‌గ్గ‌డం లేదు. రవితేజ బ్యాక్ టు బ్యాక్ మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ‘రావణాసుర’ వంశీ తెరకెక్కిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ త్రినాథరావు నక్కిన తో ‘ధమాకా’ చిత్రాలు చేస్తున్నాడు.

ఉన్నాడా, లేడా?

థ‌మాకా చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లపై అభిషేక్ అగర్వాల్ టి.జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రాన్ని దీపావళి బరిలో సినిమాని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. మూవీ మంచి హిట్ కొడుతుంద‌ని వారు విశ్వ‌సిస్తున్నారు. అయితే ఆడియన్స్ లో మాత్రం ఈ సినిమాపై పెద్ద‌గా అంచ‌నాలు లేవు.

సినిమాపై అంచ‌నాలు పెంచాలంటే మేకర్స్ రిలీజ్ అప్ డేట్ ని అధికారికంగా ప్రకటించి కాస్త హడావిడీ చేయాల్సందేనని చెబుతున్నారు. దీపావళి బరిలో సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా మేకర్స్ రిలీజ్ డేట్ ని ప్రకటించకపోతే ఈ మూవీ దీపావళి రేస్ లో వున్నట్టా.. లేనట్టా అనే క్లారిటీ ప్రేక్షకుల్లో మిస్సయ్యే ఛాన్స్ వుందని కొందరు సూచ‌న‌లు చేస్తున్నారు. మ‌రి ర‌వితేజ ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుంటే మంచిది అని సూచిస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News