మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన “ఈగల్” (eagle) చిత్రానికి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అది కూడా ఎవరి నుంచి వచ్చిందంటే… మాస్ మహారాజ నుంచే!
యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక సాలీడ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇటీవల ఈ చిత్రం యొక్క స్పెషల్ ప్రివ్యూను రవితేజ చూశాడు.
సినిమా చూసిన తర్వాత, రవితేజ “super satisfied” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ఈ చిత్రానికి మొదటి రివ్యూ రవితేజ నుంచే వచ్చిందని చెప్పవచ్చు.
ఈ ఫిబ్రవరి 9న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. రవితేజ రివ్యూ లాగానే ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం నచ్చుతుందో లేదో చూడాలి.
-Advertisement-