Friday, May 10, 2024
Homecinemaravanasura movie review : ర‌వితేజ 'రావణాసుర' ఎలా ఉందంటే ?

ravanasura movie review : ర‌వితేజ ‘రావణాసుర’ ఎలా ఉందంటే ?

Telugu Flash News

ravanasura movie review : ర‌వితేజ హీరోగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రావణాసుర’. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా రూపొందించ‌గా, ఈ చిత్రం కోసం ర‌వితేజ తొలిసారి క్రిమిన‌ల్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించారు.

ఈ పాత్ర కోసం మాస్ రాజా కొంత మంది లాయ‌ర్స్‌ను క‌లిసి వారి బాడీ లాంగ్వేజ్‌ను నేర్చుకుని మ‌రీ న‌టించారు.. సుశాంత్ ఇందులో కీల‌క పాత్ర పోషించ‌గా, అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫ‌రియా అబ్దుల్లా, ద‌క్షా న‌గార్క‌ర్‌ హీరోయిన్స్‌గా న‌టించారు. నేడు విడుద‌లైన ఈ చిత్ర క‌థ ఎలా ఉందో చూద్దాం.

క‌థ‌:

రవితేజ ఫైరా అబ్దుల్లా అనే సీనియర్ లాయర్ దగ్గర జూనియర్ గా పనిచేస్తూ ఉన్న స‌మ‌యంలో మేఘా ఆకాష్ తన తండ్రి సంపత్ రాజ్ మీద పడిన మర్డర్ కేసు అభియోగం పై విచారణ జరిపి అసలు నిజం తెలుసుకొని తన తండ్రిని విడిపించేందుకు రవితేజ మరియు ఫైరా అబ్దుల్లా ఇద్దరిని సంప్రదిస్తుంది.

ఆ తర్వాత అలాంటి మర్డర్స్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉండ‌గా, రవితేజ నే అది చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఎందుకు ఆయన మర్డర్స్ చేస్తున్నాడు, కారణం ఏమిటి..?, అంత నెగటివ్ గా ఎందుకు మారాడు అనేదే మిగిలిన క‌థ‌.

ప‌ర్‌ఫార్మెన్స్:

ఈ చిత్రంలో రవితేజ రవీంద్ర అనే లాయర్ పాత్రలో కనిపించి మెప్పించారు. చాలా రోజుల తర్వాత రవితేజ యాక్షన్, కామెడీ, నెగిటివ్ షేడ్స్ ఇలా ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ క‌న‌బ‌రిచారు అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో కూడా రవితేజ తన పెర్ఫామెన్స్ తో కథని రక్తి కట్టిస్తూ ముందుకు నడిపించారు అని చెప్పాలి. సాలిడ్ సీన్స్ ఆస‌క్తిక‌రంగా సాగుతాయి.

అక్కినేని హీరో.. సుశాంత్‌ కూడా కీలకపాత్రలో నటించాడు. సుశాంత్ పాత్రపై కొంత వ‌ర్క‌వుట్ చేస్తే బాగుండేది. చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉండ‌గా, వారి గ్లామ‌ర్ మాత్రం సినిమాకి చాలా క‌లిసొచ్చింది.

-Advertisement-

ravanasura movie reviewఇక ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ స్వామి రారా తర్వాత ఆ తరహా ఇంపాక్ట్ పెద్ద‌గా చూపించలేదు. అయితే ఈ చిత్రంలో సుధీర్ వర్మ తన స్క్రీన్ ప్లే ప్రతిభని మరోసారి చూపించారు. నెగిటివ్ షేడ్స్ లో రవితేజని ఒక విలన్ లాగా చూపిస్తూ సుధీర్ వర్మ మాస్ మహారాజ్ క్యారెక్టర్ ని చాలా ఆసక్తికరంగా మలిచారు. నిర్మాణ విలువ‌ల బాగున్నాయి. కెమెరా ప‌నిత‌నం, ఎడిటింగ్ వ‌ర్క్ కూడా పర్వాలేద‌నిపిప‌స్తుంది.

ప్ల‌స్ పాయింట్స్:

ర‌వితేజ న‌ట‌న‌
స్ర్క్రీన్ ప్లే
గ్లామ‌ర్

మైన‌స్ పాయింట్స్:

క్లైమాక్స్
ఎడిటింగ్

చివరిగా:

దర్శకుడు సినిమా ప్లాట్‌ను చూపించిన విధానం సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి.. సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా పెద్ద ఎసెట్. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్. హీరోయిన్స్ రోల్స్ ఇంప్రెసివ్ గా లేవు కాని రవితేజ నటనతో రావణాసుర బ్లాక్ బస్టర్ మూవీగా నిలిపేలా చేశాడు.

ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత రావణాసుర చిత్రం రవితేజకి బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ మూవీ ఇచ్చింది. నెగిటివ్ షేడ్స్ లో రవితేజ నటన ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ అని చెప్పాలి.. థ్రిల్, కామెడీ, యాక్షన్ అంశాలతో రవితేజ తన ఫ్యాన్స్ కి మంచి ప్యాకేజ్ అయితే ఇచ్చారు . చాలా రోజుల తర్వాత వరుస ఫ్లాపుల నుంచి సుధీర్ వర్మకి రావణాసుర చిత్రం కొంత రిలీఫ్ ఇచ్చింది..

also read :

Vladimir Putin: పుతిన్‌ గురించి సంచలన విషయాలు వెల్లడించిన మాజీ సైనికాధికారి!

One Rupee Biryani: మార్కాపురంలో రూపాయికే బిర్యానీ.. ఆఖరికి రెస్టారెంట్‌ యాజమాన్యం ట్విస్ట్‌!

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News