HomecinemaRashmika: స‌మంత ఆరోగ్యం గురించి స్పందించిన ర‌ష్మిక‌.. ఎమోష‌న‌ల్ అవుతూ స్ట‌న్నింగ్ కామెంట్

Rashmika: స‌మంత ఆరోగ్యం గురించి స్పందించిన ర‌ష్మిక‌.. ఎమోష‌న‌ల్ అవుతూ స్ట‌న్నింగ్ కామెంట్

Telugu Flash News

Rashmika: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన స‌మంత ప్ర‌స్తుతం చాలా ట‌ఫ్ సిట్యుయేష‌న్‌లో ఉంది. ఒక‌వైపు నాగ చైత‌న్య‌తో విడాకులు తీసుకొని తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లో ఉండ‌గా, మ‌రో వైపు స‌మంత‌ని మయోసైటిస్ అనే వ్యాధి వేధిస్తుంది.ఆ వ్యాది వ‌ల‌న సమంత ఇప్ప‌టికి ఇంటికే పరిమితమైంది. బయటకు వచ్చిన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే స్థితిలో లేదు. సమంత వల్ల అటు జరగాల్సిన సినిమాలన్నీ ఆగిపోగా, ఆమె న‌టిస్తున్న‌ ఖుషి సినిమాకి కూడా బ్రేకులు ప‌డ్డాయి. ఇక యశోద సినిమా కోసం అతి కష్టం మీద ప్రమోషన్స్ చేసింది స‌మంత‌. ఆ స‌మ‌యంలో తన పరిస్థితి గురించి చెబుతూ కన్నీరు పెట్టేసుకుంది.

అయితే తాజాగా స‌మంత గురించి ర‌ష్మిక స్పందిస్తూ క‌న్నీరు పెట్టుకుంది.ర‌ష్మిక మందన్న, సమంత ఆఫ్ ద స్క్రీన్ లో మంచి స్నేహితులు కాగా, ర‌ష్మిక తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ .. సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సమంత ఒక అద్భుతమైన స్త్రీమూర్తి అని పేర్కొంది. ఆమె అందమైనదే కాదు, దయాగుణం కలిగిన వ్యక్తి అని కొనియాడింది. సమంత మయోసైటిస్ కు గురైన విషయం ఆమె ప్రకటించిన తర్వాతే తనకు తెలిసిందని రష్మిక పేర్కొంది. గతంలో మయోసైటిస్ గురించి తమ మధ్యన ఎప్పుడూ ప్రస్తావన కూడా రాలేదని చెప్పింది.. ఇటువంటి పరిస్థితుల్లో ఒక అమ్మలా మారి సమంతను కాపాడుకోవాలనుకుంటున్నానని, ఆమె వెన్నంటి నిలవాలనుకుంటున్నానని రష్మిక తెలిపింది.

జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి నుంచి అందరూ స్ఫూర్తి పొందుతారని, ఆ విధంగా తాను కూడా సమంత నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతానని రష్మిక పేర్కొంది. తాను ఎంతగానో ఇష్టపడే సామ్ కు ఇకపై అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని ర‌ష్మిక చాలా ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేసింది. కాగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ‘పుష్ప’ చిత్రంలో సమంత ‘ఊ అంటావా’ ఐటమ్ సాంగ్ లో నటించగా, ఆ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. రష్మిక నటించిన వారీసు మూవీ తెలుగులో వారసుడు పేరుతో జనవరి 12న రిలీజ్‌కాబోతోంది. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే మిషన్ మజ్ను కూడా నేరుగా ఓటీటీలో విడుదల‌‌కానుంది

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News