Homecinemarashmika mandanna : ర‌ష్మిక హిందీ మాట్లాడ‌డం ఎప్పుడైన చూశారా.. ఎంత ముద్దుగా మాట్లాడిందో తెలుసా?

rashmika mandanna : ర‌ష్మిక హిందీ మాట్లాడ‌డం ఎప్పుడైన చూశారా.. ఎంత ముద్దుగా మాట్లాడిందో తెలుసా?

Telugu Flash News

rashmika mandanna: నేష‌న‌ల్ క్రష్ ర‌ష్మిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్కర్లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. ర‌ష్మిక సినిమా చేస్తే సూప‌ర్ హిట్ అనేంతగా మారింది ప్ర‌స్తుత ప‌రిస్థితి. ర‌ష్మిక‌ చేతుల్లో ప్ర‌స్తుతం చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి.

ఇటీవల సీతారామం సినిమాలో చేసిన పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించడంతో ర‌ష్మిక‌కి ఆఫ‌ర్స్ మీద ఆఫర్స్ వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో విజ‌య్‌తో ఓ సినిమా చేయ‌నుంది. వార‌సుడు టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఈ సినిమా కోసం ర‌ష్మిక 5 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

క్యూట్ మాట‌లు…

రష్మిక మందన్న.. పుష్ప సినిమా హిట్‌తో నేషనల్ క్రష్‌గా మారిన విష‌యం తెలిసిందే. శ్రీ వ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక న‌ట విశ్వ‌రూపం చూపించి ఎంద‌రో మ‌న‌సులు గెలుచుకుంది. ర‌ష్మిక న‌టించిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రష్మిక క్రేజ్ ఫుల్ పెరిగిపోయింది.

ఇటు తెలుగు.. అటు తమిళ్, హిందీ సినిమాలతో చాలా బిజీగా ఉంటుంది.. ఎక్కడ చూసినా.. రష్మిక పేరే వినిపిస్తుంది. ఇక సోష‌ల్ మీడియాలోను ఈ అమ్మ‌డి హ‌వా మాములుగా లేదు. కేక పెట్టించే అందాలు చూపిస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. ఆ మ‌ధ్య కాలంలో ర‌ష్మిక త‌న అందాల ఆర‌బోత‌తోనే వార్త‌ల‌లో నిలిచింది.

ర‌ష్మిక ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ ర‌చ్చ చేస్తుంది. గుడ్ బై, మిస్టర్ మజ్ను, యానిమల్ చిత్రాలతో బిజీగా ఉండ‌గా, ఇటీవ‌ల ఆమె యానిమల్ చిత్రీకరణలో పాల్గోంటున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్‌గా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన ర‌ష్మిక‌. ఫోటోగ్రాఫర్లతో ముచ్చటించింది.

ఆమె ఇంగ్లీష్‏లో మాట్లాడుతుండగా, వారు ఆమెను హిందీలో మాట్లాడమని కోరారు. దీంతో సినిమా ట్రైలర్ చూశారా అంటూ హిందీలో మాట్లాడటం మొద‌లు పెట్టింది. సినిమాని అంద‌రు త‌ప్ప‌క చూడండ‌ని కూడా కోరింది. ర‌ష్మిక ముద్దుముద్దు మాట‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

-Advertisement-

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News