HomecinemaRashmika Mandanna : సౌత్‌ - నార్త్‌ - సౌత్‌ .. బోలెడు సినిమాలతో రష్మిక బిజీ బిజీ

Rashmika Mandanna : సౌత్‌ – నార్త్‌ – సౌత్‌ .. బోలెడు సినిమాలతో రష్మిక బిజీ బిజీ

Telugu Flash News

Rashmika Mandanna : రష్మిక మందన్న సౌత్‌తో పాటు నార్త్‌లోనూ సత్తా చాటుతోంది. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. రెండో సినిమా ‘గీత గోవిందం’తో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. ఆ సినిమాల తర్వాత వరుసగా స్టార్ నటులతో మూవీస్ చేస్తూ టాలీవుడ్ లో స్టార్ నటి గా గుర్తింపు తెచ్చుకుంది.

రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప నేషనల్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాతలు గమనించారు. ఈ మూవీ తో పాటు మూడు బాలీవుడ్ సినిమాలలో నటించే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అన్ని ఇండస్ట్రీలలో బిజీ అయిపోయింది. ఇక తాజాగా ఈ అమ్మాయి తెలుగులో మరో క్రేజీ సినిమాలో భాగమైంది.

సర్ సినిమాతో తెలుగులో తిరుగులేని మార్కెట్ క్రియేట్ చేసుకున్న ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ములతో తెలుగు స్ట్రెయిట్ సినిమా చేస్తున్నాడు. ఆకాశంలో ఓ వైపు భవనాలు, మరోవైపు మురికివాడలు.. వాటి మధ్య నోట్ల కట్టలతో ఇప్పటికే విడుదలైన పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇది డబ్బుకు సంబంధించిన కథ అని స్పష్టం అవుతోంది.

తాజాగా ఈ సినిమాలో ధనుష్ సరసన రష్మిక నటించబోతోందని నిర్మాతలు వెల్లడించారు. ఇప్పటికే నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడనే వార్తలతో సినిమాపై ఎనలేని అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు రష్మిక కూడా ఈ సినిమాలో భాగం కావడంతో సినిమాపై మామూలు హైప్ రాలేదు.

rashmika mandannaప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రేపో మాపో కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం రెయిన్‌బో అనే ద్విభాషా చిత్రం చేస్తోంది. శాంత రూబన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు శాకుంతలం ఫేమ్ దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

దీంతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ చిత్రంలో రణబీర్ సరసన రష్మిక నటిస్తుంది. ఇప్పటికే ఆమె టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. దీంతో పాటు మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప సీక్వెల్‌లో నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఇన్‌సైడ్ టాక్.

-Advertisement-

also read :

Rashmika Mandanna : అర్థరాత్రి రష్మిక అలాంటి పనులు చేస్తుందా ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News