Telugu Flash News

Ramoji Rao : రికార్డులు దొరక్కుండా జూమ్‌ ద్వారా కౌన్సెలింగ్‌.. డిలీట్‌ చేయాలని రామోజీ ఆదేశం!

Ramoji Rao margadarshi scam

Ramoji Rao Margadarshi scam : మార్గదర్శి స్కామ్‌లో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. చందాదారులను మోసగిస్తూ అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ సంస్థపై ఏపీ సీఐడీ అధికారులు కొన్ని రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ కేసులో ఏ1గా చెరుకూరి రామోజీరావు, ఏ2గా ఆయన కోడలు చెరుకూరి శైలజాకిరణ్‌ను సీఐడీ అధికారులు చేర్చారు. ప్రస్తుతం అక్రమాలు వెలుగు చూడొద్దనే ఉద్దేశంతో రామోజీరావు అలర్ట్‌ అయ్యారు.

రికార్డులేవీ దర్యాప్తు సంస్థలకు అందవద్దని, జూమ్‌ మీటింగ్‌ ద్వారా చిట్‌ కార్యాలయాలకు కనెక్ట్‌ అవుతున్నారు. ఆధారాలు దొరక్కుండా డిలీట్‌ చేసేయాలని బ్రాంచి మేనేజర్లకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు రామోజీ.

మార్గదర్శి కుంభకోణంలో కీలక ఆధారాలేవీ దొరక్కుండా ధ్వంసం చేయాలని రామోజీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఎలా వాటిని నాశనం చేయాలో జూమ్‌ మీటింగ్‌ ద్వారా బ్రాంచీల్లో సిబ్బందికి సూచించారట.

ఆధారాల ధ్వంసం ప్రక్రియ పర్యవేక్షణ హైదరాబాద్‌ నుంచి జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోర్‌మెన్‌ కమిటీ పర్యవేక్షిందట. అర్ధ రాత్రి దాకా ఈ వ్యవహారాలను పర్యవేక్షించినట్లు ఏపీ సీఐడీ గుర్తించింది.

మార్గదర్శిలో నిధులు మళ్లింపు, అక్రమ పెట్టుబడులు పెట్టినట్లు తేలిపోవడంతో కేసుదర్యాప్తును పక్కదారి పట్టించేలా మార్గదర్శి పెద్దలు కుట్ర చేశారని అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలోనే కేసు దర్యాప్తుకు అవసరమైన ఆధారాలను ధ్వంసం చేయరాదనే నిబంధనను రామోజీ ఉల్లంఘిచినట్లు స్పష్టమవుతోంది. గతంలోనూ రామోజీరావు నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్లు డిపాజిట్లను వసూలు చేసినట్లు 2006లో తేలింది.

అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకు మార్గదర్శి స్కామ్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో మోసాన్ని అంగీకరించారు రామోజీరావు. కేసు దర్యాప్తు దశలో ఉండగానే మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను హఠాత్తుగా రామోజీ మూసేశారు. ఇప్పుడు కూడా ఏపీ సీఐడీ అధికారులు డొంక కదిలిస్తుండడంతో రికార్డులను మాయం చేసే ప్రక్రియకు రామోజీ శ్రీకారం చుట్టారట.

అయితే, రామోజీ చర్యలను పసిగట్టిన సీఐడీ విభాగం.. ధ్వంసం చేసిన రికార్డులన్నింటినీ రిట్రీవ్‌ చేసింది. ఆన్‌లైన్‌ రికార్డులన్నింటినీ తిరిగి సంపాదించిన సీఐడీ.. దీంతో రామోజీకి ఈ వ్యవహారం కాస్తా తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.

మార్గదర్శిలో కుంభకోణం బహిర్గతం కావడంతో కొత్త చిట్టీలు వేసేందుకు చందాదారులు ముందుకు రావడం లేదట. చాలా కాలం నుంచి బ్రాంచి కార్యాలయాల్లో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయని తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌ నుంచి కొత్త చిట్టీలే వేయలేదు.

దీంతో మార్గదర్శి చిట్‌ ఫండ్‌ కంపెనీలో మనీ సర్క్యులేషన్‌ ఆగిపోయింది. చందాదారులు చెల్లించిన మొత్తాన్ని రామోజీ అక్రమంగా సొంత సంస్థలకు వాడుకోవడంతో చందాదారులు గగ్గోలు పెడుతున్నారు.

also read :

Rajinikanth : రజనీకాంత్‌పై వైసీపీ అటాక్.. చంద్రబాబును పొగడటంపై నేతల కౌంటర్లు!

shruti haasan: నెటిజ‌న్స్ చెత్త ప్ర‌శ్న‌ల‌కు శృతి హాస‌న్ ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్స్

Exit mobile version