HomecinemaRam Charan: ఎన్టీఆర్‌గారు నాకు చికెన్ వ‌డ్డించారు.. ఇంట్రెస్టింగ్ విష‌యాలు చెప్పిన రామ్ చ‌ర‌ణ్‌

Ram Charan: ఎన్టీఆర్‌గారు నాకు చికెన్ వ‌డ్డించారు.. ఇంట్రెస్టింగ్ విష‌యాలు చెప్పిన రామ్ చ‌ర‌ణ్‌

Telugu Flash News

Ram Charan: మహానటుడు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు శత జయంతి ఉత్సవాలు గత యేడాది కాలంగా వివిధ ప్రాంతాల్లో ఘ‌నంగా నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలని కూడా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి సినీ పరిశ్ర‌మ‌కు చెందిన చాలా మంది ప్ర‌ముఖుల‌ని ఆహ్వానించారు.

మురళీమోహన్, జయప్రద, జయసుధ, కృష్ణవేణి లాంటి సీనియర్ నటీనటులు.. నాగ చైతన్య, సుమంత్, అడివిశేష్, సిద్దు జొన్నలగడ్డ , మెగా పవర్ స్టార్ రాంచరణ్ లాంటి న‌టి తరం నటులు ఈ కార్య‌క్ర‌మంలో సంద‌డిచేశారు. ప్ర‌తి ఒక్క‌రు కూడా ఎన్టీఆర్ గొప్ప తనాన్ని కొనియాడారు.

ఇక మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాగా, ఆయ‌న రామ్ చ‌ర‌ణ్‌ని త‌న ప‌క్క‌నే కూర్చోపెట్టుకున్నారు.ఇక రామ్ చ‌ర‌ణ్ త‌న ప్ర‌సంగంలో అన్న‌గారితో త‌నకున్న అనుబంధం గుర్తు చేసుకున్నారు.

ram charan meet chandrababuవెండితెరపై అందాల రాముడైనా … కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్ర చేసిన కూడా ఆ పాత్ర‌కు నిండుద‌నం తెచ్చే వ్య‌క్తి ఎన్టీఆర్ గారు. సినిమాల‌లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్నారని రామ్ చరణ్ అన్నగారి గొప్పతనం గురించి గొప్ప‌గా చెప్పారు.

నా జీవితంలో ఎన్టీఆర్‌ను కేవ‌లం ఒకే ఒక్కసారి కలిశాను. ఆయన నాకు ప్రత్యేకంగా బ్రేక్ ఫాస్ట్ వడ్డించారు అంటూ అప్ప‌టి విషయాన్ని ఈ సందర్భంగా రామ్ చరణ్ గుర్తు చేసుకున్నారు.నేను 5వ తరగతి చదివే స‌మ‌యంలో పురందేశ్వరి గారి అబ్బాయితో కలసి స్కేటింగ్ క్లాసులకు వెళ్ళేవాడిని. పురందేశ్వరి వాళ్ళ అబ్బాయి ఒకరోజు మా తాతగారి ఇంటికి వెళదాం రా అని పిలిస్తే నేను కూడా వెళ్లాను. చాలా సెక్యూరిటీ చూసాను.

జై ఎన్టీఆర్ అంటూ రామ్ చరణ్

ఇక అందరూ చెబుతున్నట్లే ఆయన మార్కింగ్ వ్యాయామాలు అన్నీ పూర్తి చేసుకుని పెద్ద చికెన్ ఒక‌టి పెట్టుకుని బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. అయితే అప్పుడు మాకు కూడా చికెన్ వడ్డించారు. నేను ఎన్టీఆర్ గారిని చూడడం అదే తొలిసారి అని రాంచరణ్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ గారు మన స్థాయికి అందని వ్యక్తి. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి నటుడు, నటి ఎన్టీఆర్ గారిని తలచుకోకుండా అయితే ఉండరు.

-Advertisement-

ఇప్పుడు పాన్ ఇండియా అని అంటున్నాం కానీ.. అప్పట్లోనే ఆయన సౌత్ ఇండియా సత్తాని దేశం మొత్తం చాటిన మ‌హా మ‌నిషి .. తెలుగు సినీ ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు త‌ప్ప‌క‌ ఉంటుంది. తెలుగు వారి పవర్ ఇపుడు కాదు.. అప్పట్లోనే లోకానికి చాటిన గొప్ప వ్య‌క్తి ఎన్టీఆర్ గారు అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

అనంత‌రం జై ఎన్టీఆర్ అంటూ రామ్ చరణ్ తన ప్రసంగాన్ని ముగించారు. రామ్ చరణ్.. అన్న ఎన్టీఆర్‌ గారితో కాకుండా.. ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కలిసి న‌టించి తెలుగు సినిమా స్థాయిని ద‌శ‌దిశ‌ల‌కు పాకేలా చేసిన విష‌యం మ‌న‌కు తెలిసిందే.

also read :

Tirumala: మే 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

today horoscope in telugu : ఈ రోజు రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News