Telugu Flash News

Ram Charan: ఆనంద్ మ‌హీంద్రాతో రామ్ చ‌ర‌ణ్ నాటు నాటు స్టెప్పులు.. వీడియో వైర‌ల్

Ram Charan: ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజమౌళి తెర‌కెక్కించిన సూప‌ర్ హిట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పటికే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ , సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు రాగా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు వచ్చాయి. అయితే ఈ పాట‌కి ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర‌.. రామ్ చ‌రణ్‌తో క‌లిసి స్టెప్పులేశాడు.

హైదరాబాద్ లోని ఫార్ములా రేసింగ్ ఈవెంట్ చూసేందుకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగార్జున.. ప్రముఖ బిజినెస్ మ్యాన్, మహీంద్రా సంస్థల ఓనర్ ఆనంద్ మహీంద్రా పాల్గొని సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఆనంద్ , రామ్ చ‌ర‌ణ్ స్టెప్పులు వేయ‌గా, ఇందుకు సంబంధించిన‌ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రేసు విషయం పక్కన పెడితే, హైదరాబాద్ ఈ-ప్రీ‌లో నాకు ఒక రియల్ బోనస్ దక్కింది. రామ్ చరణ్ దగ్గర నుంచి బేసిక్ నాటు నాటు స్టెప్స్ నేర్చుకున్నాను. నీకు కృతజ్ఞతలు. ఆస్కార్స్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాను మై ఫ్రెండ్’ అని ఆనంద్ మహీంద్ర ట్వీట్‌లో పేర్కొన్నారు.

also read :

Viral Video: పెళ్లిలో పన్నీర్‌ కోసం లొల్లి.. బుర్రలు పగిలేలా కొట్టుకున్నారు!

Viral Video : టర్కీలో భూకంపం వచ్చే ముందు పక్షుల అరుపులు చూశారా?

Exit mobile version