HomecinemaRajasekhar : శ్రీదేవి సంబంధం మిస్ కావ‌డంతో జీవిత‌ని పెళ్లి చేసుకున్న రాజ‌శేఖ‌ర్

Rajasekhar : శ్రీదేవి సంబంధం మిస్ కావ‌డంతో జీవిత‌ని పెళ్లి చేసుకున్న రాజ‌శేఖ‌ర్

Telugu Flash News

Rajasekhar:  సీనియ‌ర్ యంగ్ హీరో రాజ‌శేఖ‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేద‌. అప్ప‌ట్లో ఆయ‌నకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పోలీస్ పాత్ర‌ల‌లో ఎంతో న‌టించి మెప్పించారు. ఇప్ప‌టికీ ఆయ‌న హీరోగా అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే జీవిత‌ని పెళ్లి చేసుకున్న రాజ‌శేఖ‌ర్.. శ్రీదేవి నుండి మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్ అందుకున్నాడ‌ట‌.

శ్రీదేవి ఫాదర్‌, రాజశేఖర్‌ ఫాదర్‌ మంచి స్నేహితులు. దూరపు బంధువులు కావ‌డంతో రాజశేఖర్‌ నచ్చి ఆయనకు శ్రీదేవిని పెళ్లికి అడిగారట. కానీ మా వాడు ఎంఎస్‌ చేయాలని ఇప్పుడే పెళ్లి వద్దని రాజశేఖర్‌ పేరెంట్స్ చెప్పారని స‌మాచారం.

అయితే శ్రీదేవి సంబంధాన్ని వద్దనుకోవడానికి అసలు కారణం వేరే కార‌ణం ఉంద‌ని రాజశేఖర్‌ బయటపెట్టారు. తమ పేరెంట్స్ కి సినిమా వాళ్లంటే అస్స‌లు నచ్చదు. తాను హీరో అవుతానంటే కూడా ఒప్పుకోలేదు.

సినిమాలు చేయ్‌, కానీ అక్కడ ప్రేమ దోమ అంటూ తిరిగితే ఒప్పుకునేది లేదని, తాము చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే కండీషన్‌ మీద సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. శ్రీదేవి సంబంధం ఆయ‌న‌కి రాగా, అప్పటికే ఆమె సినిమాల్లో ఉండటంతో అది నచ్చకనే సంబంధాన్ని రిజెక్ట్ చేశారట.

అలా శ్రీదేవిని పెళ్లి చేసుకోవాల్సిన రాజశేఖర్‌ మరో నటి జీవితని పెళ్లి చేసుకున్నాడు. Jeevitha Rajasekhar marriage photoశ్రీదేవిని చేసుకుంటే బాగుండేదని ఎప్పుడన్నా అనుకున్నారా అన్న ప్రశ్నకి రాజశేఖర్‌ స్పందిస్తూ, అలా ఎప్పుడూ అనుకోలేదని, జీవితని పెళ్లి చేసుకోవడం తన అదృష్టమని స్ప‌ష్టం చేశాడు.

ఇవి కూడా చూడండి :

-Advertisement-

Nabha Natesh Latest Photo gallery, Photoshoot, Images 2023

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News