Telugu Flash News

Radhe Shyam to hit Amazon Prime Video on April 1

Radhe Shyam in OTT

Radhe Shyam in Prime : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ 11-03-2022 రోజు థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం టాక్‌ కాస్త నెగెటివ్ గా ముందుకెళ్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన రాధే శ్యామ్ అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అందుకే కొందరు నెటిజెన్ లు మూవీ పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. రీసెంట్ గా ఈ భారీ బడ్జెట్ చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదల అవుతుందని టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా ఏ మూవీ అయినా థియేటర్లలో విడుదలయిన 4 వారాలలో ఓటీటీలో వస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం వల్ల ‘రాధే శ్యామ్’ ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు అంచనాలు వేయడం స్టార్ట్ చేశారు. తాజాగా రాధే శ్యామ్ డిజిటల్ రైట్స్‌ను భారీ మొత్తంతో అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని ఇన్ఫర్మేషన్.

అమెజాన్ ప్రైమ్ చేతికి ఓ మంచి మూవీ వచ్చి చాలారోజులు అయ్యింది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో పోటీ ఎక్కువగా అవడంతో ప్రైమ్ ఈమధ్య కాస్త వెనకబడింది. అయితే రాధే శ్యామ్ విషయంలో మాత్రం అలా జరగకూడదని, ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ప్రైమ్ యాజమాన్యం భారీగానే ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది.

రాధే శ్యామ్‌ను ఉగాది ముందు రోజున ఓటీటీ ప్రేక్షకుల ముందుగా తీసుకురావాలని అమెజాన్ ప్రైమ్ అనుకున్నారు . మామూలుగా ఏప్రిల్ 11న రాధే శ్యామ్ ఓటీటీలో విడుదల కావాల్సి ఉన్నా.. ఏప్రిల్ 1 ఉగాది ముందు రోజు స్ట్రీమింగ్ ప్రారంభిస్తే.. ఓటీటీలో కూడా రాధే శ్యామ్ రికార్డులు బద్దలుకొడుతుందని అమెజాన్ ప్రైమ్ భావిస్తోందట.

మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ చదవండి :

Rashmika Mandanna : యూట్యూబ్ లో చిట్ చాట్ ..అన్ని విషయాలు చెప్పేసింది..

ప్రభాస్ ఇందుకే పెళ్లి చేసుకోలేదట , 5000 ప్రపోజల్స్‌లో ఒకర్ని ఎంచుకోవడం కష్టమే మరి !

అక్కినేని నాగార్జున ‘ The Ghost ‘ షూటింగ్ దుబాయ్‌లో.. సోనాల్ చౌహాన్ తో తొలి సారి..

 

Exit mobile version