HomecinemaPushpa2: పుష్ప‌2లో ఐటెం సాంగ్ చేసేదెవ‌రో ఇలా తెలిసిపోయింది..!

Pushpa2: పుష్ప‌2లో ఐటెం సాంగ్ చేసేదెవ‌రో ఇలా తెలిసిపోయింది..!

Telugu Flash News

Pushpa2:  లెక్క‌ల మాస్టారు సుకుమార్ తెర‌కెక్కిస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ పుష్ప‌2. తొలి పార్ట్ మంచి విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు సెకండ్ పార్ట్‌ని భారీ రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్నారు. పుష్ప-2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఈ మూవీ చెప్పిన టైంకే విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ మూవీలో ఐటెం సాంగ్ చేసేది ఎవ‌రు అనే దానిపై ఇప్పుడు చిన్న క్లారిటీ వ‌చ్చేసింది.

పుష్ప‌లో స‌మంత‌తో ఐటెం సాంగ్ చేయించ‌గా, ఇప్పుడు పుష్ప 2 కోసం సీర‌త్ క‌పూర్‌ని తీసుకున్న‌ట్టు టాక్. రీసెంట్‌గా సీర‌త్ త‌న పోస్ట్‌లో అల్లు అర్జున్ గు టైట్ హగ్ ఇచ్చిన పిక్ షేర్ చేస్తూ.. డ్యాన్సర్స్‌ కి ఎగిరేందుకు రెక్కలు అక్కర్లేదు.. వారి ఎనర్జీనే లీడ్ చేస్తుంది అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ అమ్మ‌డు సినిమాలో ఐటెం సాంగ్ చేయ‌నుంద‌ని అభిమానులు డిసైడ్ అయ్యారు. కాగా, సీరత్ కపూర్ కి కూడా టాలీవుడ్ లో పెద్ద‌గా సినిమాలు ఏమీ లేవు. ఈ నేపథ్యంలోనే సీరత్ కపూర్‌ పుష్ప-2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఒప్పుకుంద‌ని, దీంతో ఈ అమ్మ‌డు టాలీవుడ్‌లో కూడా పాగా వేయాల‌ని అనుకుంటుంద‌ని అంటున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News