HomecinemaPushpa 2: పుష్ప‌ 2 ఆర్టిస్ట్‌ల‌తో వెళుతున్న బ‌స్సుకి ప్ర‌మాదం.. ప‌లువురికి తీవ్ర గాయాలు..!

Pushpa 2: పుష్ప‌ 2 ఆర్టిస్ట్‌ల‌తో వెళుతున్న బ‌స్సుకి ప్ర‌మాదం.. ప‌లువురికి తీవ్ర గాయాలు..!

Telugu Flash News

Pushpa 2: స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప‌2 సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ సక్సెస్‌ఫుల్ కాంబోలో రూపొందుతున్న పుష్ప- 2పై జనాల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఆర్య, పుష్ప చిత్రాలు సూపర్ హిట్ కావడం, ఇప్పుడు అదే సినిమాకు సీక్వల్ గా పుష్ప 2 రూపొందుతున్న నేపథ్యంలో ప్రేక్షక లోకంలో ఆతృత చాలా ఉంది.

పుష్ప2 సినిమాను డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు మేక‌ర్స్ . సంక్రాంతి సీజన్ కి ముందే బన్నీ అభిమానులను థ్రిల్ చేయాలని సుకుమార్ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

అయితే పుష్ప-2 ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైన‌ట్టు తెలుస్తుంది.. నార్కట్‌పల్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పుష్ప-2 ఆర్టిస్టులతో కూడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్ట‌గా, ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. పుష్ప-2 సినిమా షూటింగ్ ముగించుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించిన వెంటనే పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారని చెబుతున్నారు.

గాయాలపాలైన వారిని వెంట‌నే అంబులెన్స్‌లలో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు స‌మాచారం.. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందించ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలుసుకునేందుకు సమీపంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు . ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ దక్కంచుకున్న అల్లు అర్జున్ కి పాన్ వరల్డ్ క్రేజ్ దక్కేలా సుకుమార్ ప్లాన్ చేశాడని టాక్.. ఈ పుష్ప 2 సినిమాను వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తెరకెక్కిస్తున్న‌ట్టు సమాచారం అందుతుంది. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 20కి పైగా దేశాల్లో విడుదల చేయాలని దర్శకుడు సుకుమార్ టార్గెట్ పెట్టుకున్నారట.

-Advertisement-

ఇకపోతే పుష్ప 2 ది రూల్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల కోసం కూడా భారీ పోటీ నెలకొంద‌ని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం భారీ ఆఫర్స్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. డిజిట‌ల్ హ‌క్కుల‌ను ఐదు భాష‌ల్లో క‌లిపి మేక‌ర్స్ ఏకంగా రూ. 200 కోట్లు కోట్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

read more news :

Pushpa 2 : పుష్ప‌2 లీక్… ఈ ట్విస్ట్‌కి ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

Pushpa2: పుష్ప‌2లో ఐటెం సాంగ్ చేసేదెవ‌రో ఇలా తెలిసిపోయింది..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News