HomecinemaPuri jagannadh: డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ నెక్ట్స్ మూవీ ఎప్పుడు.. అందులో హీరో ఎవ‌రు..!

Puri jagannadh: డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ నెక్ట్స్ మూవీ ఎప్పుడు.. అందులో హీరో ఎవ‌రు..!

Telugu Flash News

Puri jagannadh: ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో డాషింగ్ డైరెక్ట‌ర్ మంచి ఫామ్‌లోకి వ‌చ్చాడ‌ని అంద‌రు అనుకున్నారు. కాని ఆ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేసిన లైగ‌ర్ సినిమా దార‌ణంగా ఫ్లాప్‌ని చ‌వి చూసింది. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌దుప‌రి సినిమాపై అంద‌రిలో ఆస‌క్తి పెరిగింది.

అభిమానులంతా ‘కొత్త సినిమా ఎప్పుడు ?’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఐతే, పూరి.. బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తుండ‌గా, దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది

బాలయ్యకి పూరి జగన్నాథ్ ఇటీవ‌ల ఓ కథ చెప్పాడని, బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్ర‌చారాలు న‌డిచాయి. నిజానికి పూరి జగన్నాథ్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో లేదా బాలకృష్ణ తో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించడానికి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

గతంలో చిరుకి ఆటోజానీ కథ చెప్ప‌గా, ప్ర‌స్తుతం ఆ కథ పైనే పూరి గ‌ట్టిగా కసరత్తులు చేస్తున్నాడు. పూరి రాస్తున్న ఈ కథ మెగాస్టార్ కి నచ్చకపోతే, బాలయ్య దగ్గరకు వెళ్తుంది అని అంటున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లోనే పూరీ త‌దుప‌రి సిన‌మాపై ఓ క్లారిటీ అయితే వ‌స్తుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News