Tuesday, May 14, 2024
Homebeautybanana hair mask : అరటి పండుతో హెయిర్‌ మాస్క్.. మీ జుట్టు నిగనిగలాడటం గ్యారెంటీ!

banana hair mask : అరటి పండుతో హెయిర్‌ మాస్క్.. మీ జుట్టు నిగనిగలాడటం గ్యారెంటీ!

Telugu Flash News

banana hair mask : వేసవి కాలంలో జుట్టు మెరుపును కోల్పోకుండా కాపాడుకోవాలి. జుట్టు సహజ రంగు అద్భుతంగా ఉంటుంది. మీ జుట్టుకు సహజ సంరక్షణను అందించాలనుకుంటే హెయిర్ మాస్క్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

1. ఇందుకోసం అరటి పండు ఒకటి, 2 స్పూన్ హెన్నా పౌడర్, టీస్పూన్ కాఫీ పొడి, గిన్నెలో పెరుగు, స్పూన్ ఆవాల నూనె కావాల్సి ఉంటుంది.

2. అరటిపండు తొక్క తీసి మెత్తగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. పెరుగుతో మిక్సీలో గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ కూడా చేసుకోవచ్చు.

3. పేస్ట్‌లో మిగతావన్నీ మిక్స్ చేసి గంట పాటు ప్లేట్‌తో కప్పి ఉంచాలి. తర్వాత ఈ హెయిర్ మాస్క్‌ని మీ తలకు అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి.

4. ఈ హెయిర్ మాస్క్‌ మీ జుట్టుకు నెలకు రెండు సార్లు ఉపయోగించాలి. దీంతో మీ జుట్టు సహజమైన షైన్ పొందుతుంది.

5. జుట్టు కూడా మందంగా తయారవుతుంది. పెరుగులో ప్రొటీన్ లోపాన్ని, జుట్టులో తేమ లోపాన్ని తొలగిస్తుంది.

-Advertisement-

6. కాఫీ ,హెన్నా పౌడర్ జుట్టు సహజ రంగును నిర్వహించడానికి దోహదపడుతుంది. ఈ రెండూ జుట్టు పై పొరకు అదనపు షైన్ ,రంగును ఇస్తాయి.

7. సూర్యకాంతి కారణంగా దెబ్బతిన్న జుట్టు రంగు మళ్లీ మెరుపుతో నిగనిగలాడుతుంది.

8. మస్టర్డ్ ఆయిల్ జుట్టుకు తేమను అందించడంతో పాటు జుట్టు మూలాల్లో యాంటీ ఫంగల్ ఎలిమెంట్‌గా ఉపయోగపడుతుంది.

Also Read :

Puri jagannadh: డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ నెక్ట్స్ మూవీ ఎప్పుడు.. అందులో హీరో ఎవ‌రు..!

IPL 2023 : ఐపీఎల్‌కి కామెంటేట‌ర్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News