HomecinemaPriyanka Chopra: నా 'లో' దుస్తులు ఆ డైరెక్ట‌ర్ చూడాల‌ని అనుకున్నాడు

Priyanka Chopra: నా ‘లో’ దుస్తులు ఆ డైరెక్ట‌ర్ చూడాల‌ని అనుకున్నాడు

Telugu Flash News

Priyanka Chopra: ఇటీవ‌లి కాలంలో చాలా మంది హీరోయిన్స్ త‌మ కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులు, విచిత్ర ప‌రిస్థితుల గురించి మొహ‌మాటం లేకుండా చెప్పేస్తున్నారు. తాజాగా గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఓ ద‌ర్శ‌కుడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచింది. మొదట్లో చాలా మంది ఆమె చర్మం రంగుపై విమర్శలు గుప్పించ‌డంతో దానిపై కూడా ఓపెన్‌గానే మాట్లాడింది. ఇక ఇప్పుడు ఓ హిందీ దర్శకుడి గురించి షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చి వార్త‌ల‌లోకి ఎక్కింది ప్రియాంక‌. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ప్రియాంక అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ ద్వారా హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. దీంతో ఫుల్‌ పాపులరైన ఈ బ్యూటీ ఇప్పుడు వరుస ఆఫర్లు దక్కించుకుంటూ గ్లోబల్ బ్యూటీగా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది.

అయితే కెరీర్ బిగినింగ్ డేస్‌లో ఎలాంటి వివక్షకు గురైందో, ఫిలిం మాఫియా తనను ఎలా ఇండస్ట్రీ వదిలి వెళ్లేలా చేసిందో ఇప్ప‌టికే ఆమె చెప్ప‌డం చూశాం. ఇక తాజాగా ఒక హిందీ సినిమా షూటింగ్‌లో బాలీవుడ్ దర్శకుడు తన లోదుస్తులు చూపించాలని అడ‌గాడ‌ని, ఇదే కారణంతో తాను ఆ సినిమా నుంచి వెంట‌నే తప్పుకున్నట్లు కూడా చెప్పుకొచ్చింది ప్రియాంక‌. అప్పుడే నేను బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాను. ఒక సినిమాలో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు దర్శకుడు నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు నీ లోదుస్తులన్నీ తీసేయాలని చెప్ప‌డంతో, నాకు చాలా కోపం వచ్చింది. అండర్ వేర్ చూపించమని అడిగితే అప్పుడు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అయితే దానికి ఒప్పుకోని నేను మరుసటి రోజే నేను ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాను. ఇందులో నాకు నటించడం ఇష్టం లేదు అని చెప్పి ప్రాజెక్ట్‌కి గుడ్ బై చెప్పారు అని ప్రియాంక చోప్రా పాత సంఘటనను గుర్తు చేసుకుంది.

అయితే త‌న‌ని ఇబ్బంది పెట్టిన‌ ఆ దర్శకుడు ఎవరు అనేది మాత్రం ప్రియాంక చెప్పలేదు. ఇక ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక‌ ప్రియాంక ఏ విషయాన్నైనా బయటకు చెప్పేందుకు చాలా ఇబ్బందిత ప‌డ‌తుఉంద‌ట‌. అమెరికా వెళ్లిన కొత్తలో అయితే పక్కవారితో ఎలా స్నేహంగా ఉండాలో తెలియ‌క చాలా ఇబ్బంది ప‌డ్డాను అని ప్రియాంక ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేసింది. అక్కడ ఆడవారితో ఎలా స్నేహంగా ఉండాలో మొదట అర్థం కాక స‌త‌మ‌తం అయ్యేదాన్ని. క్యాంటీన్‌కు వెళ్లినప్పుడు ఆమారం ఎలా తీసుకోవాలో కూడా తెలిసేది కాదు. వెండింగ్ మిషన్ నుంచి స్నాక్స్ తీసుకొని బాత్రూమ్‌లోకి వెళ్లి ఎవరూ చూడకుండా అక్క‌డ‌ తినేసి క్లాస్ రూమ్‌కు వెళ్లేదాన్ని అని చెప్పుకొచ్చింది.

read more :

Amaravati: అమరావతిలో తొలిసారి సీఎం జగన్‌ బహిరంగ సభ.. ఆ రైతుల నిరసన లెక్కచేయరా?

Telangana: తగ్గేదే లే.. కేంద్రం, రాష్ట్రం పోటాపోటీగా రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు ప్లాన్!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News