Sunday, May 12, 2024
HomesportsPrithvi Shaw : సెల్ఫీలు ఇవ్వలేదనే కోపంతో క్రికెటర్‌ పృథ్వీ షాపై దాడి..

Prithvi Shaw : సెల్ఫీలు ఇవ్వలేదనే కోపంతో క్రికెటర్‌ పృథ్వీ షాపై దాడి..

Telugu Flash News

టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా (Prithvi Shaw) పై దాడి జరిగింది. తన ఫ్రెండ్‌తో కలిసి నిన్న ఓ హోటల్‌కు వెళ్లిన పృథ్వీ షాపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఊహించని ఈ ఘటనతో పృథ్వీ బిత్తరపోయాడని సమాచారం. ఈ మేరకు ముంబైలోని ఓషివారా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. అక్కడున్న కొందరు యువకులు పృథ్వీ షాతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. పృథ్వీ తిరస్కరించడంతో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కొందరు పృథ్వీ షాపై దాడికి దిగినట్లు సమాచారం.

అయితే, డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించినట్లుగా ఫిర్యాదులో పృథ్వీ షా ఫ్రెండ్‌ ఆశిష్‌ సురేంద్ర పేర్కొన్నట్లు తెలుస్తోంది. సురేంద్రతో కలిసి శాంతాక్రూజ్‌లోని ఓ అధునాతన హోటల్‌కు పృథ్వీ షా వెళ్లాడని పోలీసులు తెలిపారు. నిందితులు సెల్ఫీల కోసం పృథ్వీ షా వద్దకు చేరుకున్నారు. అయితే, చాలా మంది ఉండటంతో అందరితో కష్టమని.. ఇద్దరికి మాత్రమే సెల్ఫీలు దిగేందుకు పృథ్వీ షా ఆసక్తి చూపించాడని తెలుస్తోంది.

తాను భోజనం చేసేందుకు స్నేహితుడితో కలిసి వచ్చానని, ఇప్పుడు అందరికీ సెల్ఫీలు ఇవ్వడం కుదరదని పృథ్వీ షా చెప్పాడు. దీంతో తమకు సెల్ఫీలు కావాల్సిందేనంటూ వారు పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో పృథ్వీ షా స్నేహితుడు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ను పిలిచి ఫిర్యాదు చేశాడు. వారందరినీ హోటల్‌ నుంచి వెళ్లిపోవాలని మేనేజర్‌ సూచించడంతో నిందితులు ఇందంతా మనసులో పెట్టుకున్నారు. అనంతరం హోటల్‌ నుంచి పృథ్వీ షా బయటకు వచ్చాడు.

కారులోకి పృథ్వీ, అతడి ఫ్రెండ్‌ ఎక్కగానే బేస్‌బాల్‌ బ్యాట్లతో నిందితులు దాడికి పాల్పడ్డారు. బీఎండబ్ల్యూ కారు వెనుక, ముందు భాగంలో అద్దాలను నిందితులు పగులగొట్టారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో పృథ్వీ షా కారులోనే ఉన్నాడని స్నేహితుడు తెలిపాడు. అయితే దీనిపై మరింత వివాదం చేయకూడదనే ఉద్దేశంతో పృథ్వీ షాను వేరే కారులో ఇంటికి పంపినట్లు సురేంద్ర పోలీసులకు తెలిపాడు.

ఓ మహిళ తన కారును వెంబడించి మరీ జోగేశ్వరి లోటస్ పెట్రోల్‌ పంప్‌ వద్ద ఆపేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సమస్యను సాల్వ్‌ చేయాలంటే 50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసిందని, లేకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించిందని పృథ్వీ షా స్నేహితుడు తెలిపాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులిల్లో ఇద్దరిని గుర్తించారు. సనా అలియాస్‌ సప్నా గిల్, శోభిత్‌ ఠాకూర్‌ను అరెస్టు చేశారు. 8 మందిపై కేసు నమోదు చేశారు.

also read:

-Advertisement-

Taraka Ratna : తారకరత్న హెల్త్‌ అప్‌డేట్‌ రిలీజ్‌.. ప్రస్తుతం ఎలా ఉందంటే..

Ram Charan: ఆమె నా ఫ‌స్ట్ క్ర‌ష్‌.. ఆమెను అలా చూస్తూ ఉండిపోతాన‌న్న రామ్ చ‌ర‌ణ్‌

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News