Homecinemaటాప్‌ పొజిషన్‌లో ప్రభాస్‌, సమంత.. సెలబ్రిటీ సర్వేలో వెల్లడి

టాప్‌ పొజిషన్‌లో ప్రభాస్‌, సమంత.. సెలబ్రిటీ సర్వేలో వెల్లడి

Telugu Flash News

బాహుబలి సినిమా పాన్‌ ఇండియా లెవెల్ లో విడుదల అవడంతో పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు ప్రభాస్‌. ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. అయితే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి.

అయితే ఇవేవీ ప్రభాస్ క్రేజ్‌పై ప్రభావం చూపలేదు. పైగా రెమ్యునరేషన్ కూడా పెంచారు తప్ప తగ్గలేదు. ప్రభాస్ రెమ్యునరేషన్ రాధేశ్యామ్ కంటే ముందు రూ.100 కోట్లు.

ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న సినిమాలకు 120 కోట్లుగా రెమ్యునరేషన్ తీసుకుంటునట్టు సమాచారం .. ప్రభాస్ డిమాండ్ కు నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఎందుకంటే సినిమాకు హిట్ టాక్స్ వస్తే వెయ్యి కోట్ల వరకు వసూలు చేస్తుందని మూవీ మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత ప్రజాదరణ పొందిన టాలీవుడ్ నటులలో అతను మొదటి స్థానంలో ఉన్నాడు.

ప్రముఖ మీడియా సంస్థ అర్మాక్స్ దేశంలోని సెలబ్రిటీలపై ప్రతి నెల సర్వే నిర్వహించి టాప్ పొజిషన్ల జాబితాను విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే ఆగస్ట్ నెల లో మోస్ట్ పాపులర్ అయిన టాలీవుడ్ నటీ నటుల సర్వే లిస్ట్ రివీల్ అయింది. హీరోల్లో ప్రభాస్, సమంత హీరోయిన్లలో మొదటి స్థానంలో నిలిచారు.

-Advertisement-

 

ప్రభాస్ తర్వాత స్థానంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు ఉన్నారు. హీరోయిన్లలో కాజల్, అనుష్క తర్వాతి స్థానంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు చదవండి :

Venkatesh: వెంక‌టేష్ అల్లుడు కావ‌ల్సిన రామ్ చ‌ర‌ణ్‌.. ఉపాస‌న‌కి భ‌ర్త అయ్యాడా..!

Nagarjuna: స‌మంత,నాగ చైత‌న్య విడాకుల‌పై స్పందించిన నాగార్జున‌.. సామ్ వెళ్లిపోవ‌డం దుర‌దృష్ట‌కరం..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News