Homecinemaస్వామి మాలలో ప్ర‌భాక‌ర్ కొడుకు చంద్రహాస్‌ పోజులు.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్

స్వామి మాలలో ప్ర‌భాక‌ర్ కొడుకు చంద్రహాస్‌ పోజులు.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్

Telugu Flash News

ఒక‌ప్పుడు బుల్లితెర మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్నారు ప్ర‌భాక‌ర్. అప్ప‌ట్లో ఈటీవీలోని ప్ర‌తి సీరియ‌ల్లో ఆయ‌న త‌ప్పనిస‌రిగా క‌నిపించేవారు. మ‌ధ్య‌లో కాస్త గ్యాప్ తీసుకున్న ఆయ‌న తిరిగి మ‌ళ్లీ సీరియ‌ల్స్ సినిమాలు చేస్తున్నారు.

అయితే ఇటీవల ప్ర‌భాక‌ర్ తన కుమారుడు చంద్రహాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాని ప్రారంభించారు ప్ర‌భాక‌ర్. ప్రారంభోత్సవం రోజు ఫోటోల్లో యాటిట్యూడ్‌ చూపిస్తూ కనిపించాడని, చూడ్డానికి నిత్యానంద స్వామిలా క‌నిపించాడ‌ని ఆయ‌న‌ని చాలా ట్రోల్ చేశారు. ఆ దెబ్బకి తండ్రి ప్రభాకర్‌ స్పందించి రిక్వెస్ట్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ఎంట్రీ స‌మ‌యంలో ఎవ‌రికి ఇలాంటి ట్రోల్ జ‌ర‌గ‌లేదు.. కానీ ప్రభాకర్‌ కొడుకుపై జరిగింది. ఆయనపై నెగటివ్‌ కామెంట్లు వినిపించినా, పరోక్షంగా అది పాపులారిటీని తీసుకొచ్చిందని చెప్పాలి. అది పరోక్షంగా హీరో సినిమాకి ప్రమోషన్‌ తెచ్చిపెట్టినట్టే కావ‌డంతో, ప్రభాకర్‌ కూడా లైట్‌ తీసుకున్నారు .

ఆ తర్వాత మీడియాకి దూరమైన చంద్రహాస్‌ ఇప్పుడు మరోసారి హాట్‌ టాపిక్‌గా నిలిచాడు.. సోషల్‌ మీడియాలో ఆయన ఫోటోలు ఇప్పుడు తెగ‌ రచ్చ చేస్తున్నాయి. స్వామి మాలలో ఉన్న చంద్రహాస్‌ పోజులు ఇప్పుడు నెటిజన్ల విమర్శలకు కారణం అవుతుంది.

చంద్రహాస్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పంచుకున్నారు. కొత్త కారు కొన్న విషయాన్ని, అలాగే ఫ్యామిలీతో కలిసి ఆధ్యాత్మిక టూర్‌కి వెళ్తున్నట్టుగా తెలిపాడు. ఇందులో చంద్ర‌హాస్ స్వామి మాల‌లో ఉండ‌గా, ఆయ‌న కొత్త కారుపై ఇచ్చిన స్టయిలీష్‌ పోజులు చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

-Advertisement-

ఇందులోనూ ఆయన యాటిట్యూడ్‌ చూపిస్తున్నారని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. స్వామి మాలలో ఉండి ఇలాంటి పిచ్చి వేశాలేంటి స్వామి.. మాలలోనూ ఇలాంటి యాటిట్యూడ్‌ ఏంటని ప్రశ్నలు కురిపిస్తున్నారు.ఈ ఫోటోలను, ఆయన యాటిట్యూడ్‌గా అనిపించిన పిక్స్ కి మీమ్స్ జోడిస్తూ ర‌చ్చ చేస్తున్నారు.

ఇక చంద్రహాస్‌ హీరోగా పరిచయం అయిన చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు ఏవీఆర్‌ మూవీ వండర్స్ సంపత్‌ వి రుద్ర దర్శకత్వంలో ఓ సినిమా, ప్రభాకర్‌ సొంత నిర్మాణ సంస్థ శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్ లో మరో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Chandra Hass (@chandrahass8)

also read news:

చలికాలంలో ఇమ్యూనిటీ పెంచే 10 అద్భుతమైన పోషకాహార చిట్కాలు

Bigg Boss 6: హౌజ్‌లోకి సోహైల్.. సిరి, శ్రీహాన్ మ‌ధ్య చిచ్చు పెట్టి క‌థ మొత్తం మార్చేశాడుగా..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News