Sunday, May 19, 2024
HomecinemaPonniyin selvan2 : పొన్నియన్ సెల్వన్ 2 సింగ‌ర్ కి తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం.. గీతా మాధురి రియాక్ష‌న్ ఏంటంటే..!

Ponniyin selvan2 : పొన్నియన్ సెల్వన్ 2 సింగ‌ర్ కి తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం.. గీతా మాధురి రియాక్ష‌న్ ఏంటంటే..!

Telugu Flash News

Ponniyin selvan2 : మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సూప‌ర్ హిట్ చిత్రం పొన్నియ‌న్ సెల్వ‌న్. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో మూవీకి సీక్వెల్‌గా పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 రూపొందింది. ఈ చిత్రం కూడా మ‌చి విజ‌యం సాధించింది. అయితే ఈ చిత్రంతో యువ గాయని రక్షిత సురేష్ సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 2015లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన రక్షిత సురేష్ ప్రస్తుతం సింగర్ గా పలు అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.ఈ అమ్మ‌డు తాజాగా ఘోర ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ బయటపడ్డారు.

రక్షిత సురేష్ ప్రస్తుతం మలేషియాలో ఉంటుండ‌గా, ఆమె ఇండియాకి తిరిగి వచ్చేందుకు ఎయిర్పోర్ట్ కి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ కి ఢీకొట్టిందట. అయితే నేను ఈ రోజు మేజర్ యాక్సిడెంట్ కి గురయ్యాను. నేను ప్రయాణిస్తున్న కారు వేగంగా డివైడర్ ని డీ కొట్టింది. అంతేకాదు ఒక్కసారిగా పక్కకి దూసుకెళ్లింది. ఈ క్షణాలలో నా జీవితం మొత్తం ఒక్కసారిగా కళ్ళముందు ఫ్లాష్ అయినట్లు అనిపించింది. ఎయిర్ బ్యాగ్స్ మమ్మల్ని కాపాడాయి. ఈ ఎఫెక్ట్ నుంచి నేను ఇంకా బయటపడలేదు. ఇప్పటికీ వణికిపోతున్నా. అదృష్టం కొద్దీ ప్రాణాలతో ఉన్నాం అనిపిస్తోంది’ అంటూ రక్షిత సురేష్ పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్ కి గీతా మాధురి ‘థ్యాంక్ గాడ్.. నీవు త్వరగా కోలుకోవాలి’ అని కామెంట్ పెట్టింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News