దానిమ్మ పండును చాలా మంది ఇష్టపడతారు. దానిమ్మ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగడానికి దానిమ్మ పండు ఉపయోగపడుతుంది. సాధారణంగా దానిమ్మ పండు తిన్నాక తొక్కను పడేస్తుంటారు. అయితే, దానిమ్మ తొక్క (Pomegranate Peel) తోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా దానిమ్మ తొక్కలో ఉండే విటమిన్లు మన ఆరోగ్యానికి దోహదపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. కానీ, దానిమ్మ తొక్కను ఎలా తింటాం.. అనుకుంటున్నారా? నేరుగా తినాల్సిన పనిలేదు.
దానిమ్మ తొక్కలతో టీ తయారు చేసుకొని తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. దానిమ్మ పండు తిన్నాక దాని తొక్కలను ఎండబెట్టాలి. ఎండలో ఉంచడానికి వీలు లేకపోతే మైక్రోవోవెన్‌లో వేడి చేసుకోవాలి. తర్వాత వీటిని బయటకు తీసి మిక్సీలో వేసుకొని మెత్తటి పొడిగా తయారు చేసుకోవాలి. ఆ పొడిని ఓ డబ్బాలో వేసుకోవాలి. అనంతరం ఓ కప్పు నీటిని మరిగించి అందులో ఓ టీ స్పూన్ దానిమ్మ తొక్కల పొడిని వేసి కొద్ది సేపు మరిగించాలి.
ఇలా వేడివేడిగా దానిమ్మ తొక్కలతో టీ రెడీ అవుతుంది. దీన్ని క్రమం తప్పకుండా రోజూ ఓ కప్పు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దానిమ్మ తొక్కల్లో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దానిమ్మ తొక్కల టీ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దాంతోపాటు శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
జలుబు, దగ్గును నివారిస్తుంది..
దానిమ్మ తొక్కల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ తొక్కలతో చేసిన టీ తాగడం వల్ల చలికాలంలో చాలా ఉపయోగాలు కలుగుతాయి. సాధారణ దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్న వారు దానిమ్మ తొక్కల టీ తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. ఇందులోని విటమిన్ సీ శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు తరిమేస్తుంది. దంత సౌందర్యం కోసం కూడా దానిమ్మ తొక్కల టీ పనికొస్తుంది. నోటిపూత, దంత సమస్యలను నివారిస్తుంది. కడుపులో జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
also read news:
Rishi sunak : భారతీయుడైన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గురించి తెలుసుకోండి..
YS Jagan: జగన్ చేతిలో ఆ ఎమ్మెల్యేల జాతకం.. 20 మందికి పైగా మార్పు ఖాయమా?