Telugu Flash News

Priyanka Singh : బిగ్ బాస్ పింకీ ఇలా రెచ్చిపోయిందేంటి ?

priyanka singh

Priyanka Singh : జబర్దస్త్ లో లేడీ గెటప్స్‌ వేస్తూ ఉండే సాయి తేజ్ స‌ర్జ‌రీ ద్వారా ప్రియాంకా సింగ్.. పింకీగా మారిపోయిన విష‌యం తెలిసిందే. జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టిన ప్రియాంకా సింగ్.. బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ హిస్టరీలో ఒక ట్రాన్స్ జెండర్‌ అన్ని వారాలు ఉండటం అదే తొలిసారి అని చెప్పాలి.

ఆ షో వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఆమెకి విప‌రీత‌మైన అభిమానులు కూడా ఏర్ప‌డ్డారు. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు త‌న ప‌రిస్థితి గురించి పింకీ వివ‌రించ‌డంతో చాలా మంది ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యారు. ప్ర‌స్తుతం పెద్ద‌గా టీవీ షోస్‌లో సంద‌డి చేయ‌ని పింకీ సోష‌ల్ మీడియ‌లో మాత్రం తెగ ర‌చ్చ చేస్తుంది. కొత్త కొత్త ఫొటోలు, రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉన్న నేప‌థ్యంలో తాజాగా పింకీ చేసిన ఓ ఫోటో షూట్ మాత్రం ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది.

Khajuraho Temples : శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో గురించి తెలుసుకోండి

ఇందులో పింకీ విప‌రీత‌మైన గ్లామ‌ర్ డోస్ పెంచేసి హీటెక్కించింది. ఈ పోస్టు చూసిన నెటిజన్స్‌ ఇప్పటివరకు ఆమెపై ఉన్న సాఫ్ట్ కార్నర్, అభిమానం అన్నీ పోయాయంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు ఆమెపై పాజిటివ్‌గా మాట్లాడిన వారు విమర్శలకు దిగారు. మరీ ఇంత దారుణమైన ఫొటోలు పెట్టాల్సిన అవసరం ఏమోచ్చింది అని తిట్టి పోస్తున్నారు.

Exit mobile version